GSLV F12 Rocket : జిఎస్ఎల్ వీ – ఎఫ్12 రాకెట్ స‌క్సెస్

శ్రీ‌హ‌రికోట నుంచి ప్ర‌యోగం

GSLV F12 Rocket : భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ (ఇస్రో) మ‌రో మైలు రాయిని దాటింది. మ‌రో రాకెట్ ను విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. జీఎస్ఎల్ వీ – ఎఫ్ 12 ప్ర‌యోగం ఫ‌ల‌వంత‌మైంది. సోమ‌వారం శ్రీ‌హ‌రి కోట లోని స‌తీశ్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ నుంచి నావిగేష‌న్ శాటిలైట్ ను విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలోకి పంపింది.

జీఎస్ఎల్ వీ – ఎఫ్ 12(GSLV F12 Rocket) వాహ‌న నౌక ఎన్వీసీఎస్ -01 ఉప గ్ర‌హాన్ని ఉద‌యం 10.42 గంట‌ల‌కు నింగిలోకి తీసుకు వెళ్లింది. ఈ ప్ర‌యోగం ద్వారా భార‌త నావిగేష‌న్ వ్య‌వ‌స్థ మ‌రింత మెరుగు ప‌డింది. ఇదిలా ఉండ‌గా నావిగేష‌న్ సేవ‌ల కోసం గ‌తంలో పంపిన వాటిలో నాలుగు ఉప‌గ్ర‌హాల జీవిత కాలం ముగిసింద‌ని , వాటి స్థానంలో ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక ఉప‌గ్ర‌హాన్ని (రాకెట్ ) రోద‌సీలోకి పంపుతున్నామ‌ని ఇస్రో చైర్మ‌న్ సోమ‌నాథ్ వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా జీఎస్ఎల్ వీ – ఎఫ్ 12 రాకెట్ పొడ‌వు 51.7 మీట‌ర్లు ఉండ‌గా బ‌రువు 420 ట‌న్నులు క‌లిగి ఉంది. భార‌త దేశానికి చెందిన రెండో త‌రం నావిక్ ఉపగ్ర‌హాల్లో ఎన్వీఎస్ -01 మొద‌టిది. ఈ ఉప‌గ్ర‌హం భార‌త్ ప్ర‌ధాన భూ భాగం చుట్టూ సుమారు 1500 కిలోమీట‌ర్ల ప‌రిధిలో రియ‌ల్ టైమ్ పొజిష‌నింగ్ సేవ‌ల‌ను అంద‌జేయ‌నుంది.

Also Read : Revanth Reddy Yatra

 

Leave A Reply

Your Email Id will not be published!