GST Returns : జూన్ లో భారీగా పెరిగిన జీఎస్టీ ఆదాయం
2022-23 లో వసూళ్లు 1.51 లక్షల కోట్లు
GST Returns : కేంద్ర ప్రభుత్వానికి ఊహించని రీతిలో ఆదాయం దక్కింది. గత జూన్ నెలలో జీఎస్టీ(GST Returns) ఆదాయం రూ. 1,44,616 కోట్లకు పెరిగింది. ఇది ప్రారంభం నుండి రెండో అత్యధికంగా నమోదైంది.
2022-23 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో సగటు నెలవారీ స్థూల జీఎస్టీ వసూళ్లు రూ. 1.51 లక్షల కోట్లు. నెల వారీ జీఎస్టీ సేకరణ 1.40 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది ఐదోసారి.
గతంలో కంటే జూన్ నెలలో వస్తు సేవల పన్ను వసూలు భారీగా పెరగడం విశేషం. ఇది ఐదేళ్ల కిందట కొత్త పరోక్ష ప న్ను విధానం ప్రారంభమైన తర్వాత రెండో అత్యధికం.
వేగవంతమైన ఆర్థిక పునరుద్దరణ , కఠినమైన సమ్మతి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఏప్రీల్ లో జీఎస్టీ వసూళ్లు రూ. 1, 67, 540 కోట్లు.
జీఎస్టీ ప్రాంరభమైన నాటి నుండి నెల వారీగా జీఎస్టీ వసూళ్లు రూ. 1.40 లక్షల కోట్లు మార్క్ దాటడం ఐదోసారి. మార్చి 2022 నుండి నాల్గో నెలలో వసూళ్లు సాధించడం ఇది ఐదోసారి.
జూన్ 2022 వసూళ్లు రెండో అత్యధికం మాత్రమే కాకుండా ట్రెండ్ ను కూడా అధిగమించాయి. గతంలో గమనించిన విధంగా తక్కువ వసూళ్లు నెలగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
మొదటి త్రైమాసికంలో రూ. 1.10 లక్షల కోట్లుగా ఉందని వెల్లడించింది. జూన్ లో ఆదాయం అంతకు ముందు ఏడాది ఇదే నెల రూ. 92,800 కోట్లతో పోలిస్తే 56 శాతం ఎక్కువ. ఇక మేలో ఇ -వే బిల్లుల సంఖ్య 7.3 కోట్లు గా ఉంది.
Also Read : ప్రెట్ ఎ మ్యాంగర్ తో రిలయన్స్ ఒప్పందం