GT vs CSK IPL Final 2023 : ఐపీఎల్ టైటిల్ కోసం యుద్దం

చెన్నై వ‌ర్సెస్ గుజ‌రాత్ ఢీ

GT vs CSK IPL Final 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ మే28తో ముగుస్తుంది. 10 జ‌ట్లు పాల్గొన్నాయి. రెండు నెల‌ల పాటు ఐపీఎల్ కోట్లాది మందిని అల‌రించింది. ఎన్నో రికార్డులు న‌మోదయ్యాయి. మ‌రికొన్ని బ‌ద్ద‌ల‌య్యాయి. బౌల‌ర్లు, బ్యాట‌ర్లు త‌మ‌దైన ముద్ర క‌న‌బ‌ర్చారు. యంగ్ క్రికెట‌ర్లు భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు దృష్టిని ఆకర్షించారు. ఆరంభంలో ఆశించిన రీతిలో రాణించ‌ని జ‌ట్లు రెండో సెష‌న్ లో దుమ్ము రేపాయి. వాటిలో చెన్నై సూప‌ర్ కింగ్స్(CSK) కాగా మ‌రొక‌టి ముంబై ఇండియ‌న్స్(MI). ఇక దుర‌దృష్టం వెంటాడిన జ‌ట్ల‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, రాజస్థాన్ రాయ‌ల్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . ప్లే ఆఫ్స్ కు చేరుకున్న జ‌ట్ల‌లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ కు చుక్క‌లు చూపించింది చెన్నై.

15 ప‌రుగుల తేడాతో ఓడించింది. నేరుగా ఫైన‌ల్ కు చేరింది. ఇక క్వాలిఫైయ‌ర్ -2 మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ 62 ర‌న్స్ ప‌రుగుల తేడాతో గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసింది. అంత‌కు ముందు ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ను మ‌ట్టి క‌రిపించింది.

ఐపీఎల్ టైటిల్ వేట‌లో ధోనీ సేన‌, పాండ్యా సేన త‌ల‌ప‌డ‌నున్నాయి. స‌మరానికి సిద్ద‌మ‌య్యాయి. ఆదివారం గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ మోదీ స్టేడియంలో ఇరు జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ‌నున్నాయి. ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. క్వాలిఫైయ‌ర్ -1 లో ఓడి పోయినందుకు బ‌దులు తీర్చు కోవాల‌ని క‌సితో ఉంది గుజ‌రాత్ టైటాన్స్. ఆ జ‌ట్టు ముంబైకి షాక్ ఇచ్చింది. ఇప్ప‌టికే ఫైన‌ల్ మ్యాచ్ కోసం ఏర్పాట్లు పూర్త‌య్యాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది దీనిని వీక్షించ‌నున్న‌ట్లు బీసీసీఐ అంచ‌నా వేస్తోంది.

Also Read : MS Dhoni Pandya

Leave A Reply

Your Email Id will not be published!