GT vs DC IPL 2023 : ఢిల్లీ భ‌ళా గుజ‌రాత్ బోల్తా

డిఫెండింగ్ చాంపియ‌న్ కు షాక్

GT vs DC IPL 2023 : ఐపీఎల్ 16వ సీజ‌న్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఊహించ‌ని రీతిలో బిగ్ షాక్ ఇచ్చింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్ కు. చివ‌రి దాకా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడినా జ‌ట్టును గ‌ట్టెక్కించ లేక పోయాడు. ఢిల్లీ బౌల‌ర్లు(GT vs DC IPL 2023) క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో 5 ప‌రుగుల తేడాలో ఓట‌మి పాలైంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కు ఒక ర‌కంగా కోలుకోలేని దెబ్బేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇరు జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగింది. హార్దిక్ పాండ్యా 59 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచినా రాహుల్ తెవాటియా 20 ర‌న్స్ చేసినా ఢిల్లీ క్యాపిట‌ల్స్ టార్గెట్ ను అందుకోలేక పోయారు. ఆఖ‌రి ఓవ‌ర్ లో ఢిల్లీ బౌల‌ర్ ఇషాంత్ శ‌ర్మ వికెట్ తీయ‌డంతో విజ‌యం క్యాపిట‌ల్స్ ను వ‌రించింది. ఒక ర‌కంగా ఆ జ‌ట్టుకు ఇది ఊర‌ట‌నిచ్చే గెలుపు. ఇప్ప‌టి వ‌ర‌కు 9 మ్యాచ్ లు ఆడిన ఢిల్లీ 3 మ్యాచ్ ల‌లో గెలుపొంది 6 మ్యాచ్ ల‌లో ఓట‌మి పాలైంది.

చివరి ఓవ‌ర్ మ‌రింత టెన్ష‌న్ క‌లిగించింది. కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే కావాలి. నాలుగో బంతికి తెవాటియా ఔట‌య్యాడు. ర‌షీద్ ఖాన్ 2 ర‌న్స్ కే ప‌రిమితం కాగా ఆఖ‌రి బంతికి 7 ర‌న్స్ కావాలి. చివ‌ర‌కు 1 ప‌రుగు తీయ‌డంతో గుజ‌రాత్(GT vs DC IPL 2023) ఓట‌మి పాలైంది.

టార్గెట్ ఛేద‌న‌లో గుజ‌రాత్ త‌డ‌బ‌డింది. సాహా సున్నాకే వెనుదిరిగ‌తే శుభ్ మ‌న్ గిల్ 6 , విజ‌య్ శంక‌ర్ 6, మిల్ల‌ర్ సున్నాకే పెవిలియ‌న్ దారి ప‌ట్టారు. పాండ్యా , మ‌నోహ‌ర్ , తెవాటియా ఆడినా ఓట‌మి త‌ప్ప‌లేదు గుజ‌రాత్ కు.

అంత‌కు ముందు మ‌హ్మ‌ద్ ష‌మీ రెచ్చి పోయాడు. అద్భుత బంతుల‌తో హోరెత్తించాడు ఢిల్లీని. అమ‌న్ హ‌కీం ఖాన్ 41 బంతులు ఎదుర్కొని హాఫ్ సెంచ‌రీ చేశాడు. దీంతో 8 వికెట్లు కోల్పోయి 130 ర‌న్స్ చేసింది. ఖాన్ తో పాటు అక్ష‌ర్ ప‌టేల్ 27 , రిప‌ల్ ప‌టేల్ 23 ర‌న్స్ చేశాడు. సాల్ట్ సున్నాకే ఔట్ అయితే , ర‌స్సో 8, పాండే 1, ప్రియం గార్డ్ 10 ల వికెట్లు తీశాడు ష‌మీ.

Also Read : పాండ్యా రాణించినా త‌ప్ప‌ని ప‌రాజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!