GT vs MI Qualifier2 : ద‌ర్జాగా గుజ‌రాత్ ఐపీఎల్ ఫైన‌ల్ కు

టైటాన్స్ చేతిలో ముంబై చిత్తు చిత్తు

GT vs MI Qualifier2 : అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2023 క్వాలిఫైయ‌ర్ -2 మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ టైటాన్స్(GT) ముంబై ఇండియ‌న్స్(MI) ను 62 ప‌రుగుల భారీ తేడాతో ఓడించింది. రోహిత్ సేన ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆల్ రౌండ్ షోతో ఆక‌ట్టుకుంది. అన్ని విభాగాల‌లో ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. టాస్ ఓడిన రోహిత్ శ‌ర్మ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవ‌డం మైన‌స్ పాయింట్ గా మారింది.

మైదానంలోకి వ‌చ్చిన గుజ‌రాత్ బ్యాట‌ర్లు దంచి కొట్టారు. శుభ్ మ‌న్ గిల్ పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఆడాడు. ముంబై బౌల‌ర్ల భ‌రతం ప‌ట్టాడు. చుక్క‌లు చూపించాడు. 60 బంతులు ఎదుర్కొన్న గిల్ 129 ర‌న్స్ చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్స‌ర్లు ఉన్నాయి. సాయి సుద‌ర్శ‌న్ 43 ప‌రుగుల‌తో రాణించాడు. 31 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు ఒక సిక్స్ కొట్టాడు.

శుభ్ మ‌న్ గిల్ , సాయి సుద‌ర్శ‌న్ క‌లిసి 64 బంతులు ఎదుర్కొని 138 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి గుజ‌రాత్ టైటాన్స్ 233 ర‌న్స్ తో భారీ స్కోర్ చేసింది. ప్లే ఆఫ్స్ లో ఇంత భారీ స్థాయిలో స్కోర్ చేయ‌డం ఇదే మొద‌టిసారి.

అనంత‌రం 234 ప‌రుగుల భారీ టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ముంబై ఇండియ‌న్స్ చేసిన పోరాటం ఫ‌లించ లేదు. గుజ‌రాత్ బౌల‌ర్ల ధాటికి కుప్ప కూలింది. 18.2 ఓవ‌ర్ల‌లో 171 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సూర్య కుమార్ యాద‌వ్ 61 ర‌న్స్ చేశాడు. 38 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్స‌ర్లు కొట్టాడు. తిల‌క్ వ‌ర్మ రెచ్చి పోయాడు. కేవ‌లం 14 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 43 ర‌న్స్ చేశాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో మోహిత్ శ‌ఱ్మ 14 బంతుల్లో కేవ‌లం 10 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

Also Read : Shubman Gill

 

Leave A Reply

Your Email Id will not be published!