GT vs RR IPL 2022 Final : గెలిచారా లేక గెలిపించారా..?
సోషల్ మీడియాలో తెగ ట్రోల్
GT vs RR IPL 2022 Final : ప్రపంచంలోనే టాప్ రిచ్ క్రీడా లీగ్ లలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఒకటిగా పేరొంది. ఇప్పటి వరకు 15 సీజన్లు ముగిశాయి.
2008లో ప్రారంభమైన ఈ సంబురం కంటిన్యూ అవుతూ కోట్లాది అభిమానులను సంపాదించుకుంటూ , కాసులు కురిపిస్తోంది. కోట్లు కొల్ల గొడుతోంది. వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది ఈ ఐపీఎల్ చుట్టూ. ఇదో అంతులేని , ఊహించని పద్మవ్యూహం.
ఐపీఎల్ అన్నది ఆట కాదు అది ఓ అక్షయపాత్ర అని మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించడం ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.చూస్తే ఐపీఎల్ కాని
దాని వెనుక కార్పొరేట్ శక్తులు, బిజినెస్ టైకూన్ లు, కార్పొరేట్ కంపెనీలు, బడా పొలిటికల్ లీడర్లు..ఇలా చెప్పుకుంటూ పోతే మాఫియా కూడా బ్యాక్ సైడ్ ప్రభావితం చేస్తుందన్న ఆరోపణలు లేక పోలేదు.
ఇది పక్కన పెడితే ఐపీఎల్ 2022 కథ ముగిసింది. కానీ ఇక్కడే సరికొత్త వివాదం, తీవ్ర ఆరోపణలు సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తున్నాయి. 14 సీజన్ల వరకు 8 జట్లు ఆడాయి.
ఈసారి 15వ సీజన్ లో రెండు కొత్త జట్లు చేరాయి. ఒకటి గుజరాత్ టైటాన్స్ , రెండోది లక్నో సూపర్ జెయింట్స్. ఇక్కడే చిక్కంతా వచ్చి పడింది.
ఎందుకంటే ప్రధాని గుజరాతీ, కేంద్ర హోం శాఖ మంత్రి గుజరాతీ, ఆయన తనయుడు జే షా బీసీసీఐ కార్యదర్శి. ఇక ఫైనల్ మ్యాచ్
గుజరాత్ లోని అహ్మదాబాద్ స్టేడియం. ఐపీఎల్ లో జే షాకు చెందిన వారే గుజరాత్ టైటాన్స్ యాజమాన్యంలో ఉన్నారనేది బహిరంగ రహస్యం.
ఇక్కడే ఆ జట్టు గెలుపొందేందుకు మార్గం ఏర్పడిందని , ముందే డిసైడ్ అయ్యిందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించి
ఎలాంటి ఆధారాలు లేవు.
ఇక ఫైనల్ కు చేరిన రాజస్తాన్ రాయల్స్ అద్భుతంగా ఆడింది. ప్రధానంగా ఆ జట్టు బలం బ్యాటింగ్. ఆటగాళ్లు ఆడిన తీరు అనుమానాస్పదంగా
మారింది. వచ్చీ రావడంతోనే కావాలని బంతుల్ని ఆడడం పెవిలియన్ కు చేరడం జరగడాన్ని అభిమానులు తప్పు పడుతున్నారు.
మొత్తంగా గుజరాత్ గెలిచిందా లేక రాజస్తాన్(GT vs RR IPL 2022 Final) గెలిపించిందా అన్న అనుమానం సర్వత్రా వ్యక్తం అవుతోంది. విచారణ చేపడితే కానీ అసలు విషయం తెలుస్తుంది.
Also Read : వరల్డ్ కప్ అందుకోవాలన్నది కల
Dhustulu palinchu napudu prajalu nittoorpu chendhedaru.
దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.
సామెతలు 29:2
దుష్టులు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు.