Gudlavalleru Engineering College : బాలికల హాస్టల్ లో హిడెన్ కెమెరాలు కలకలం
బాలికల హాస్టల్‌ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ....
Gudlavalleru : కృష్ణాజిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల(Gudlavalleru Engineering College)లో హిడెన్ కెమెరాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళనకు దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనను విరమింపజేశారు. బాలికల హాస్టల్ వాష్ రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ హాస్టల్ ప్రాంగణంలో అర్ధరాత్రి విద్యార్థులు ఆందోళనకు దిగారు. సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేస్తూ వియ్ వాంట్ జస్టిస్ అంటూ విద్యార్థినిలు నినాదాలు చేశారు. కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై… తోటి విద్యార్థులు దాడికి యత్నించారు. విషయం తెలుసుకొని కాలేజీ హాస్టల్‌కు పోలీసులు చేరుకున్నారు. జూనియర్, సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ.. ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్‌ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున 3.30 గంటల వరకూ ఇంజినీరింగ్ కళాశాలలో హైడ్రామా కొనసాగింది. ఫైనల్ ఇయర్ విద్యార్థికి.. మరో విద్యార్థిని సహకరిస్తూ కెమెరాలు ఏర్పాటు చేసిందంటూ విద్యార్థులంతా ఆరోపిస్తున్నారు.
Gudlavalleru Engineering College..
బాలికల హాస్టల్‌ల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ… ‘ ఎక్స్ ‘ వేదికగా విద్యార్థులు పోస్ట్‌లు పెట్టడం జరిగింది. గత వారం రోజులుగా కళాశాలలో ఇంత జరుగుతున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ కళాశాల మేనేజ్‌మెంట్‌పై సైతం విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే ఈ విషయం వెలుగు చూసినా మేనేజ్‌మెంట్ స్పందించకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం వివరాలు వెల్లడించేందుకు నిరాకరిస్తున్నారు.
Also Read : AP Home Minister : ముంబై నటి కేసుపై స్పందించిన ఏపీ హోంమంత్రి