Hukumchand Patidar : వ్యవసాయం ఎంత మాత్రం లాభ దాయకం కాదని నమ్మే వారికి ఆయన ఓ గుణపాఠంగా మిగిలి పోతారు. ఎందుకంటే ఎక్కడ గుజరాత్ ఎక్కడ విదేశాలు. ఆయన పండించే ధాన్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నారు.
ఆయన ఎవరో కాదు రాజస్థాన్ సేంద్రీయ వ్యవసాయ ఛాంపియన్ గా పిలుచుకుంటారు అంతా.
ఝులావర్ జిల్లాలోని మన్ పురా గ్రామానికి చెందిన హుకుంచంద్ పాటిదార్(Hukumchand Patidar).
సేంద్రీయ వ్యవసాయ స్ఫూర్తి ప్రదాతగా పేరొందారు. ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 2018లో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది.
కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివారు.
ఆగ్నేయ రాజస్తాన్ లోని ఓ చిన్న పల్లెటూరు నుంచి అంతర్జాతీయ మార్కెట్ల వరకు
సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో హుకుంచంద్ పాటిదార్(Hukumchand Patidar) తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు.
62 ఏళ్లకు పైగా ఉన్న పాటిదార్ మన్పురా గ్రామాన్ని అంతర్జాతీయ ఉత్పత్తుల పటంలో నిలిచేలా చేశాడు
. జపాన్, స్విట్జర్లాండ్ , జర్మనీలకు తాను పండించిన ఉత్పత్తులను పంపిణీ చేయడంతో వెలుగులోకి వచ్చాడు.
ఈ ఊరు నుంచి ఆ దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయంటే ఇదంతా ఆయన చలవే.
2012లో నటుడు అమీర్ ఖాన్ హోస్ట్ చేసిన టెలివిజన్ టాక్ షో సత్యమేవ జయతేలో కూడా ఈ రైతు పాల్గొన్నారు.
2003లో సేంద్రీయ వ్యవసాయం సాగు వైపు మొగ్గు చూపాడు పాటిదార్. వాన పాములను ఉపయోగించి కంపోస్ట్ , ఆవు పేడను ఉపయోగించి సాగు చేశాడు.
సేంద్రీయ ఎరువుల గురించి ఉదయపూర్ లోని మహారాణా ప్రతాప్ అగ్రికల్చర్ యూనివర్శిటీ వీసీ మెహతాను సంప్రదించా.
కంపోస్ట్ , ఇతర సేంద్రీయ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మట్టిలో కార్బన్ మూలాన్ని పెంచవచ్చని తెలుసుకున్నట్లు చెప్పాడు పాటిదార్.
ఇదిలా ఉండగా పటీదార్ మాన్ పురా గ్రామంలోని తన ఫామ్ హౌస్ లో ప్రతి ఏటా దాదాపు 25 టన్నుల వర్మీ కంపోస్ట్ ,
దాదాపు 600 టన్నుల తక్షణ కంపోస్ట్ ను తయారు చేస్తాడు.
గత 16 ఏళ్లుగా గ్రామంలోని 120 మంది రైతులను సేంద్రీయ వ్యవసాయంలో నిమగ్నం అయ్యేలా ప్రేరేపించాడు. రసాయన రహిత వ్యవసాయానికి కేంద్రంగా తన ఊరును మార్చేశాడు.
కొత్తి మీర పొడి, వెల్లుల్లి పేస్ట్ , మెంతుల్ని యూరోపియన్ దేశాలకు , జపాన్ కు ఎగుమతి చేస్తారు. దేశీయ మార్కెట్ లకు నారింజ, పప్పులు, ఉల్లిపాయలు సరఫరా చేస్తారు.
ప్రతి ఏటా మన్ పురా నుంచి రైతులు జపాన్ కు 100 టన్నుల ధనియాల పొడి, 2 వేల 200 కిలోల వెల్లుల్లి పేస్ట్ ను స్విట్జర్లాండ్ కు, 50 టన్నుల మెంతులు, 100 క్వింటాళ్ల ఫెన్నెల్ సీడ్ ను జర్మనీకి సరఫరా చేస్తారు.
పాటిదార్ రోజూ 4 గంటలకు లేస్తాడు. రాత్రి దాకా పొలంలోనే ఉంటాడు. పాటిదార్ వల్ల గ్రామమే ఆదర్శంగా మారింది.
Also Read : తప్పుకున్నా తగ్గని బ్రాండ్ వాల్యూ