Beth Mooney : గుజరాత్ కు షాక్ కెప్టెన్ బెత్ మూనీ ఔట్
గాయంతో డబ్ల్యూపీఎల్ నుంచి నిష్క్రమణ
Beth Mooney : ముంబై వేదికగా జరుగుతున్న మహిళా ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ జెయింట్స్ కు కోలుకోలేని షాక్ తగిలింది. వరల్డ్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందిన గుజరాత్ జెయింట్స్ స్కిప్పర్ బెత్ మూనీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ విషయాన్ని గుజరాత్ జట్టు మేనేజ్ మెంట్ వెల్లడించింది. అధికారికంగా ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.
ఆటలో భాగంగా బెత్ మూనీ తీవ్రంగా గాయపడింది. వైద్యులు చేసిన సూచన మేరకు కొన్ని రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో తప్పుకుంటున్నట్లు ప్రకటించింది బెత్ మూనీ.
ప్రస్తుతం ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. భారీ ఎత్తున ధరకు కొనుగోలు చేసింది గుజరాత్ జెయింట్స్ ను గుజరాత్ యాజమాన్యం. డీవై పాటిల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో బెత్ మూనీ(Beth Mooney) ఇబ్బంది పడ్డారు.
ఆమె కోలుకోవాలంటే కనీసం 4 లేదా 6 వారాలు పట్టనుందని సమాచారం. తాను మ్యాచ్ లకు దూరం కావడం బాధ కలిగిస్తోందని ఈ సందర్భంగా వాపోయారు బెత్ మూనీ. మైదానంలో లేక పోయినా స్టేడియంలో ఉండి ఆటను చూస్తానని చెప్పింది. ఆమె స్థానంలో దక్షిణాఫ్రికా ఓపెనర్ లారా వోల్వార్డ్ ను భర్తీ చేసింది.
బెత్ మూనీ(Beth Mooney) గాయ పడడంతో ఆమె స్థానంలో కెప్టెన్ గా గుజరాత్ మేనేజ్ మెంట్ స్నేహ రాణాకు బాధ్యతలు అప్పగించింది. ఆసిస్ ప్లేయర్ ఆష్లీ గార్డనర్ ఈ సీజన్ కు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.
Also Read : ముంబై భళా ఢిల్లీ విలవిల