GT vs KKR IPL 2022 : గుజ‌రాత్ జైత్ర‌యాత్ర కోల్ క‌తా ఓట‌మి

8 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం

GT vs KKR  : ఐపీఎల్ 2022లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ . కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్(GT vs KKR )పై 8 ప‌రుగుల తేడాతో ఓట‌మి పాలైంది.

చివ‌రి దాకా కోల్ క‌తా అలుపెరుగ‌ని రీతిలో పార‌టం చేసింది. కేకేఆర్ జ‌ట్టు(GT vs KKR )ఆదిలోనే వికెట్ల‌ను వెంట వెంట‌నే కోల్పోయింది. ఓపెన‌ర‌లు సునీల్ స‌రైన్ 5 ప‌రుగులు చేస్తే శామ్ బిల్లింగ్స్ 4 ర‌న్స్ , నితీష్ రాణా 2 , వెంక‌టేశ్ అయ్య‌ర్ 17 ప‌రుగుల‌కే వెనుదిరిగారు.

ఈ త‌రుణంలో బాధ్య‌త‌గా ఆడాల్సిన కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ పూర్తిగా నిరాశ ప‌రిచాడు. కేవ‌లం 12 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. క‌నీసం 100 ప‌రుగులైనా చేస్తారా అన్న అనుమానం క‌లిగింది కేకేఆర్ ఫ్యాన్స్ లో.

ఈ త‌రుణంలో రింకు సింగ్ ప‌ర్వాలేద‌ని అనిపించాడు. 35 ర‌న్స్ చేసి స‌త్తా చాటాడు. చివ‌ర‌లో క్రీజులోకి వ‌చ్చిన ఆండ్రీ ర‌స్సెల్ 48 ప‌రుగులు చేసి కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ప‌రువు పోకుండా కాపాడాడు.

చేతులెత్తేస్తుంద‌ని అనుకున్న స‌మ‌యంలో ఏకంగా గెలుపు అంచుల దాకా తీసుకు వ‌చ్చాడు ర‌స్సెల్. ఒక ర‌కంగా గుజ‌రాత్ పై దాడి చేశాడు.ఒకానొక ద‌శ‌లో కోల్ క‌తా గెలుస్తుంద‌ని భావించారు.

కానీ గుజ‌రాత్ బౌల‌ర్ల దెబ్బ‌కు కోల్ క‌తా ఓట‌మి మూట‌గట్టుకుంది. కేవ‌లం 8 ప‌రుగుల తేడాతో వెనుదిరిగింది. ఇదిలా ఉండ‌గా ఈ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో మ‌ళ్లీ టాప్ లో నిలిచింది గుజరాత్.

చివ‌రి 20 ఓవ‌ర్ లో 18 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా మొద‌టి బంతికి సిక్స‌ర్ కొట్టాడు. కానీ ఫెర్గూస‌న్ క్యాచ్ అందు కోవ‌డంతో ఫ‌లితం తారుమారైంది.

Also Read : పంత్ తీరుపై అజ‌హ‌రుద్దీన్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!