GT vs LSG IPL 2022 : ఆట ఏక‌ప‌క్షం ల‌క్నో ఆట అధ్వాన్నం

పోరాడ‌కుండానే చేతులెత్తేశారు

GT vs LSG IPL 2022 : ఎవ‌రైనా ఏ జ‌ట్టు అయినా 144 ప‌రుగులు ఉంటే ఈజీగా గెలుస్తామ‌ని అనుకుంటుంది. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ఐపీఎల్(GT vs LSG IPL 2022) రిచ్ లీగ్ లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగుతుంద‌ని భావించారు.

కానీ ఆట పూర్తిగా ఏక‌ప‌క్షంగా , చ‌ప్ప‌గా, పేల‌వంగా సాగింది. 145 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక పోయింది. పూర్తిగా చ‌తికిల‌ప‌డింది. ఎక్క‌డా గుజ‌రాత్ బౌల‌ర్లు ప‌రుగులు తీసేందుకు చాన్స్ ఇవ్వ‌లేదు.

దీంతో 62 ప‌రుగుల భారీ తేడాతో ఓట‌మి పాలైంది. బాధ్య‌త క‌లిగిన కెప్టెన్ కేఎల్ రాహుల్ ను అద్భుత‌మైన స్పెల్ తో పెవిలియ‌న్ దారి ప‌ట్టించాడు స్టార్ పేస‌ర్ ష‌మీ. ఇక దీప‌క్ హూడా ఒక్క‌డే 27 ర‌న్స్ చేసి ప‌ర్వాలేద‌నిపించాడు.

ఆ మాత్రం స్కోర్ చేయ‌క పోయి ఉండింటే ల‌క్నో(GT vs LSG IPL 2022) సూప‌ర్ జెయింట్స్ కేవ‌లం 50 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై పోయి ఉండేది. ఇక గుజ‌రాత్ టైటాన్స్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఆ జ‌ట్టును త‌క్కువ‌గా అంచ‌నా వేశారు.

టైటిల్ ఫెవ‌రేట్స్ గా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ , ముంబై ఇండియ‌న్స్ ఈసారి ఆశించిన మేర రాణించ లేదు. చివ‌ర‌కు ప్లే ఆఫ్స్ కు వెళ్ల‌కుండానే ఇంటి బాట ప‌ట్టాయి. కాక పోతే ఐపీఎల్ రూల్ ప్ర‌కారం 14 మ్యాచ్ లు ప్ర‌తి జ‌ట్టు ఆడాల్సిందే.

ఇక అధికారికంగా గుజ‌రాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక మిగ‌తా మూడు జ‌ట్లు ఏవి వ‌స్తాయ‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. ఈ త‌రుణంలో రాజ‌స్థాన్ , బెంగ‌ళూరు, పంజాబ్ , హైద‌రాబాద్ , ఢిల్లీ క్యాపిట‌ల్స్ ప్లే ఆఫ్స్ కోసం వేచి చూస్తున్నాయి.

 

Also Read : అబ్బా ర‌షీద్ ఖాన్ దెబ్బ

Leave A Reply

Your Email Id will not be published!