Gujarat Titans Retention : గుజ‌రాత్ టైటాన్స్ ఆరుగురు రిలీజ్

కెప్టెన్ గా కొన‌సాగ‌నున్న హార్దిక్ పాండ్యా

Gujarat Titans Retention : ఐసీసీ టి20 వ‌ర‌ల్ క‌ప్ సంబురం ముగిసింది. ఇక వ‌చ్చే ఏడాది 2023లో నిర్వ‌హించబోయే ఐపీఎల్ మెగా లీగ్ కోసం ఇప్ప‌టికే ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈసారి కేర‌ళ‌లోని కొచ్చిలో డిసెంబ‌ర్ 23న ఆట‌గాళ్ల‌ను ఏయే జ‌ట్లు తీసుకుంటాయ‌నే దానిపై వేలం పాట కొన‌సాగుతుంది.

న‌వంబ‌ర్ 15 బీసీసీఐ ఐపీఎల్ క‌మిటీ పూర్తి జాబితాను త‌మ‌కు స‌మ‌ర్పించాల‌ని ఆదేశించింది ఈ మేర‌కు ఒక్కో ఫ్రాంచైజీ జ‌ట్టు ఒక్కో రీతిన విడుద‌ల చేశాయి. ఇక ఈసారి టైటిల్ చాంపియ‌న్ గా నిలిచిన గుజ‌రాత్ ఆరుగురు ఆట‌గాళ్ల‌ను రిలీజ్ చేసింది. హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ కేన్ విలియ‌మ్స‌న్ ను వ‌దులుకుంది.

కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ 16 మందిని రిలీజ్ చేస్తే ముంబై ఇండియ‌న్స్ 13 మందిని వ‌ద్ద‌నుకుంది. ఇక గుజ‌రాత్ టైటాన్స్(Gujarat Titans Retention) ప‌రంగా చూస్తే ఎప్ప‌టి లాగే హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఉంటాడు.

అత‌డితో పాటు శుభ్ మ‌న్ గిల్ , మిల్ల‌ర్ , అభిన‌వ్ మ‌నోహ‌ర్ , సాయి సుద‌ర్శ‌న్ , సామా, మాథ్యూ వేడ్ , ర‌షీద్ ఖాన్ , రాహుల్ తెవాటియా, ద‌ర్శ‌న్ సల్కండే ,

విజ‌య్ శంక‌ర్ , జ‌యంత్ యాద్ , ష‌మీ , జోసెఫ్ , య‌శ్ ద‌యాల్ , ప్ర‌దీప్ సాంగ్యాన్ , సాయి కిషోర్ , నూర్ అహ్మ‌ద్ ల‌ను రిటైన్ చేసుకుంది గుజ‌రాత్ టైటాన్స్.

ఇక ర‌హ్మ‌నుల్లా గుర్బాజ్ , ఫెర్గూస‌న్, డొమినిక్ డ్రేక్స్ , గురుకీర‌త్ సింగ్ , జేస‌న్ రాయ్, ఆరోన్ ల‌ను మినీ వేలంలోకి విడుద‌ల చేసింది. విచిత్రం ఏమిటంటే గుజ‌రాత్ ఈసారి కీల‌క‌మైన ఫెర్గూస‌న్ , జేస‌న్ రాయ్ ను వ‌దులు కోవ‌డం.

Also Read : ఆట‌గాళ్ల‌కు ముంబై ఇండియ‌న్స్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!