PBKS vs GT IPL 2022 : ఐపీఎల్ 2022 రిచ్ లీగ్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లు ఒక ఎత్తు. ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ మరో ఎత్తు. ఆఖరి ఓవర్ చేయాల్సిన రన్స్ 19. ఇంకొకరైతే పంజాబ్ గెలుస్తుందని అంతా అనుకుంటారు.
కానీ గుజరాత్ టైటాన్స్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఆరు బంతులు 4 బంతులు కేవలం 7 పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక రెండు బంతుల్లో 12 పరుగులు కావాలి.
గెలవాలంటే గజరాత్ టైటాన్స్ (PBKS vs GT IPL 2022)కు. అక్కడ ఉన్నది రాహుల్ తెవాటియా. ఆ బాల్స్ ను సిక్సర్లుగా మలిచాడు. తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.
గతంలో పంజాబ్ కింగ్స్ పై అద్భుతమైన రికార్డు ఉంది తెవాతియాకు. గత ఏడాది మనోడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ అతడిని చేజిక్కించుకుంది.
తనపై నమ్మకం పెట్టుకున్న మేనేజ్ మెంట్ కు పూర్తి సహకారాన్ని అందించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేసింది.
నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 189 రన్స్ చేసింది. లివింగ్ స్టోన్ 27 బంతులు ఆడి 7 ఫోర్లు 4 సిక్స్ లతో 64 పరుగులు చేశాడు. అనంతరం బరిలోకి దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది.
అద్భుతంగా ఆడాడు శుభ్ మన్ గిల్ . 59 బంతులు ఆడి 96 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు ఓ సిక్స్ ఉంది. జట్టులో కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.
Also Read : జయదేవ్ ను తీసుకుంటే ముంబైకి జయం