GT vs RCB IPL 2022 : గుజ‌రాత్ ధ‌నా ధ‌న్ బెంగ‌ళూరు ప‌రేషాన్

కీల‌క పాత్ర పోషించిన డేవిడ్ మిల్ల‌ర్ , తెవాటియా

GT vs RCB : ఐపీఎల్ 2022లో గుజ‌రాత్ టైటాన్స్ జైత్ర‌యాత్ర కొన‌సాగిస్తోంది. అంత‌కు ముందు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(GT vs RCB) కెప్టెన్ పాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

వ‌రుస‌గా ఫెయిల్ అవ‌తూ వ‌స్తున్న భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో రాణించాడు. 58 ప‌రుగులు చేశాడు. ర‌జ‌త్ ప‌టిదార్ 52 ర‌న్స్ చేస్తే గ్లెన్ మ్యాక్స్ వెల్ 38 ప‌రుగుల‌తో దుమ్ము రేపారు.

దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 170 ప‌రుగులు చేసింది రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(GT vs RCB). అనంత‌రం 171 ప‌రుగుల టార్గెట్ తో మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ విజ‌యం సాధించింది.

ఆ జ‌ట్టు ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ 31 ర‌న్స్ చేస్తే వృద్ది మాన్ సాహా 29 ప‌రుగులు చేసి రాణించారు. అనంత‌రం బ‌రిలోకి వ‌చ్చిన సాయి సుద‌ర్శ‌న్ 20 ర‌న్స్ చేసి ప‌ర్వాలేద‌ని అనిపించాడు.

ఇదిలా ఉండగా గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 3 ప‌రుగులే చేసి నిరాశ ప‌రిచాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన స్టార్ హిట్ట‌ర్లు డేవిడ్ మిల్ల‌ర్ 39 ప‌రుగులు చేస్తే రాహుల్ తెవాటియా మ‌రోసారి దుమ్ము రేపాడు.

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో చుక్క‌లు చూపించిన రాహుల్ తెవాటియా మ‌రోసారి మెరిశాడు. 43 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇద్ద‌రూ ధాటిగా ఆడి త‌మ జ‌ట్టుకు మ‌రో గెలుపును అందించారు.

ఇదిలా ఉండ‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ , షాబాద్ అహ్మ‌ద్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. కానీ క‌ట్ట‌డి చేయ‌లేక పోయారు. దీంతో గుజ‌రాత్ జైత్ర‌యాత్ర సాగింది.

Also Read : ముంబైని గెలిపించిన సూర్య భాయ్

Leave A Reply

Your Email Id will not be published!