Hardik Pandya IPL 2022 : జ‌ట్టును ఒడ్డుకు చేర్చిన కెప్టెన్

మ‌రోసారి పాండ్యా కీల‌క ఇన్నింగ్స్

Hardik Pandya IPL 2022 : ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఈసారి ఐపీఎల్ 2022లో అడుగు పెట్టాయి కొత్త జ‌ట్లు గుజ‌రాత్ టైటాన్స్ , ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ . ఇక గ‌త సీజ‌న్ 2021లో అత్యంత చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో తీవ్ర నిరాశ‌కు గురి చేసిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ఈసారి క్వాలిఫ‌యిర్ -1 దాకా చేరింది.

సంజూ శాంస‌న్ వ్య‌క్తిగ‌తంగా రాణించ‌క పోయినా జ‌ట్టును న‌డిపించిన తీరు ఆక‌ట్టుకుంది. కానీ ఒక్కోసారి తీసుకున్న నిర్ణ‌యాలు జ‌ట్టుకు ఇబ్బందిగా మారాయి.

ఇక కెప్టెన్ గా ఎలా ఉండాలో, ఎలా ముందుండి జ‌ట్టును న‌డిపించాలో చేసి చూపించాడు గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya IPL 2022). ఈసారి ఐపీఎల్ టైటిల్ వేట‌లో ముందు వ‌రుస‌లో నిలిపాడు త‌న జ‌ట్టును.

ఆ జ‌ట్టు విజ‌యం వెనుక మ‌రో మాజీ క్రికెట్ ఆట‌గాడు ఉన్నాడు. అత‌డే ఆశిష్ నెహ్రా. గుజ‌రాత్ టైటాన్స్ యాజ‌మాన్యం భారీ ఎత్తున ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేసింది. ఆ జ‌ట్టు అంచ‌నాల‌కు మించి ఆడుతోంది.

ప్ర‌త్య‌ర్థుల జ‌ట్ల‌కు చుక్క‌లు చూపించింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ రిచ్ లీగ్ లో 14 మ్యాచ్ లు ఆడి 10 మ్యాచ్ ల‌లో గెలుపొంది 20 పాయింట్లు సాధించింది.

ఇక కోల్ క‌తా లో జ‌రిగిన క్వాలిఫ‌యిర్ -1 కీల‌క మ్యాచ్ లో ఏకంగా 7 వికెట్ల తేడాతో రాజ‌స్థాన్ పై ఘ‌న విజ‌యం న‌మోదు చేసింది. ఈ కీల‌క గెలుపులో ప్ర‌ధాన‌మైన పాత్ర పోషించాడు.

ఓ వికెట్ తీయ‌డమే కాదు మ్యాచ్ చివ‌రి దాకా నిలిచాడు హార్దిక్ పాండ్యా. కేవ‌లం 27 బంతులు ఆడి 5 ఫోర్ల‌తో 40 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. జ‌ట్టును ఓడ్డుకు చేర్చాడు. సిస‌లైన కెప్టెన్ అనిపించుకున్నాడు.

Also Read : మ‌రోసారి రెచ్చి పోయిన జోస్ బ‌ట్ల‌ర్

Leave A Reply

Your Email Id will not be published!