#GulzarilalNanda : ఆపత్కాలంలో ఆపద్ధర్మ ప్రధాని నందా

గుల్జారీలాల్ నందా పేరు ఈ తరం వారికి చాలా మంది తెలియక పోవచ్చు. అయన భారత దేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా భాద్యతలను చేపట్టారు. పదవిలో ఉన్న ప్రధాని ఆకస్మికంగా మరణిస్తే, లోకసభ సభ్యులు మరో నేతను ఎన్నుకుని

Gulzarilal Nanda : గుల్జారీలాల్ నందా పేరు ఈ తరం వారికి చాలా మంది తెలియక పోవచ్చు. అయన భారత దేశానికి రెండు సార్లు ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా భాద్యతలను చేపట్టారు. పదవిలో ఉన్న ప్రధాని ఆకస్మికంగా మరణిస్తే, లోకసభ సభ్యులు మరో నేతను ఎన్నుకుని ఆ పదవిలో సదరు నేత చేరే వరకు తాత్కాలికంగా ప్రధాని పదవిని రాజ్యాంగం ప్రకారం నిర్వహించే పదాధికారిని ఆపద్ధర్మ ప్రధాన మంత్రి అంటారు. అలా నందా మొదటి సారి 1964 లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మరణం తరువాత13 రోజులు (27 మే 1964 – 9 జూన్ 1964); రెండవసారి 1966లో లాల్‌ బహదూర్ శాస్త్రి మరణం తరువాత (11 జనవరి 1966 – 24 జనవరి 1966) 13 రోజులు ఈ పదవిని చేపట్టారు.

గుర్జారీలాల్ నందా(Gulzarilal Nanda )(జూలై 4, 1898 – జనవరి 15, 1998) నిబద్దత కలిగిన జాతీయ రాజకీయ నాయకుడు, ఆర్థికవేత్త. కార్మిక సమస్యలపై ప్రత్యేకంగా కృషిచేసిన వ్యక్తి. రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధాన మంత్రిగా నెల రోజుల లోపే పదవిలో ఉన్నారు. రెండు సందర్భాలలోనూ లోకసభలో మెజారిటీ సభ్యులు కలిగి ఉన్న భారత జాతీయ కాంగ్రెస్, లోకసభ నాయకుడిని అంటే ప్రధాన మంత్రిగా కొత్త నేత ఎన్నిన్నుకునే వరకు ఈ రెండు సందర్భాలలో దేశ మలి రాష్ట్రపతి సర్వెపెల్లి రాధా కృష్ణన్ చేత ప్రమాణ స్వీకారం చేయించ బడి, పరిపాలన బాధ్యతలు చేపట్టారు. 1997లో అతనికి భారత రత్న పురస్కారం స్వీకరించారు.

గుల్జారీలాల్ నందా(Gulzarilal Nanda )1898 జూలై 4న బ్రిటిష్ ఇండియాలో అవిభాజ్య పంజాబ్ ప్రాంతములోని సియాల్‌కోట్ (ప్రస్తుతము పంజాబ్ (పాకిస్తాన్)లో ఉన్నది) పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. లాహోర్, అమృత్‌సర్, ఆగ్రా, అలహాబాద్ లలో విద్యాభ్యాసం చేసారు.

ఆయన1920-1921 వరకు ఈయన అలహాబాద్ విశ్వవిద్యాలయములో కార్మిక సమస్యలపై పరిశోధన చేశారు. 1921 లో బొంబాయిలోని నేషనల్ కాలేజీలో ఆచార్య పదవిని పొందారు. అదే సంవత్సరము బ్రిటిష్ రాజ్ కు వ్యతిరేకంగా జరిగిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొన్నారు. 1922లో అహమ్మదాబాద్ టెక్స్‌టైల్ కార్మిక సంఘము కార్యదర్శిగా చేరి 1946 వరకు అందులోనే కొనసాగారు. 1932లో సత్యాగ్రహము చేసి జైలు కెళ్లారు. మరలా 1942 నుండి 1944 వరకు జైలులో గడిపారు. రిజిస్టరు కాబడిన “అలహాబాదు విశ్వ విద్యాలయ పూర్వ విద్యార్థుల అసోసియేషన్” విడుదలచేసిన 42 సభ్యుల జాబితాలో “గర్వపడ వలసిన పూర్వ విద్యార్థి” గా గౌరవింప బడ్డారు.

1937లో బ్రిటిష్ ప్రభుత్వంలో బొంబాయి శాసనసభకు ఎన్నికైనారు. తరువాత 1937 నుండి 1939 వరకు బొంబాయి ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీ గా (కార్మిక, ఎక్సైజ్ శాఖలు) సేవలనందించారు. 1946 నుండి 1950 వరకు బొంబాయి ప్రభుత్వంలో కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు అతను రాష్ట్ర శాసనసభలో కార్మిక వివాదాల బిల్లును ప్రవేశపెట్టడంలో విజయవంతంగా నాయకత్వం వహించారు. కస్తూర్బా మెమోరియల్ ట్రస్టు లో ఒక ట్రస్టీగా తన సేవలను అందించారు. హిందూస్థాన్ మజదూర్ సేవక్ సంఘ్ కు సెక్రటరీగా, బొంబాయి హౌసింగ్ బోర్డు కు చైర్మన్ గా పని చేశారు. జాతీయ ప్లానింగ్ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. “ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్” ను నిర్వహించడంలో ముఖ్యపాత్ర వహించి, తరువాత ఆ సంస్థకు అధ్యక్షునిగా భాద్యతలు చేపట్టారు.

1947లో నందా జెనీవా, స్విడ్జర్లాండ్ దేశాలలో జరిగిన అంతర్జాతీయ కార్మిక సభలకు ప్రభుత్వ ప్రతినిధిగా హాజరయ్యారు. ఆ సమావేశంలో “ప్రీడం ఆఫ్ అసోసియేషన్ కమిటి”లో పనిచేస్తూ, స్వీడన్, ఫ్రాన్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం, యు.కె దేశాలను సందర్శించి ఆ దేశాలలో గల కార్మికులు, వారి గృహ పరిస్థితులను అధ్యయనం చేసారు.

మార్చి 1950లో భారత ప్లానింగ్ కమీషన్ లో వైస్ చైర్మన్ గా చేరారు. 1951 సెప్టెంబరులో అతను భారత ప్రభుత్వంలో ప్లానింగ్ మంత్రిగా నియమింప బడ్డారు. ఆయనకు వ్యవసాయం, విద్యుత్ శాఖలను కూడా అదనంగా కేటాయించారు. 1952 సార్వత్రిక ఎన్నికలలో బొంబాయి నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తిరిగి ప్లానింగ్, వ్యవసాయం, విద్యుత్ శాఖలకు మంత్రిగా నియమితుడయ్యారు. 1955 లో సింగపూర్ లో జరిగిన ప్లాన్ కన్సల్టేటివ్ కమిటీకి భారతీయ ప్రతినిధులకు నాయకత్వం వహించారు. నందా 1957 ఎన్నికలలో లోక్‌సభకు ఎన్నిక అయి కార్మిక, ఉపాధి, ప్లానింగ్ శాఖలకు కేంద్రమంత్రిగా పనిచేసారు. 1959 లోజెనీవా జరిగిన అంతర్జాతీయ కార్మిక సమావేశాలలో పాల్గొన్నారు. తరువాత ప్లానింగ్ కమీషన్ డిప్యూటీ చైర్మంగా భాద్యతలు చేపట్టారు. 1959లో ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ, యుగోస్లేవియా, ఆస్ట్రియా దేశాలకు పర్యటించారు.

నందా 1962 ఎన్నికలలో లోక్‌సభకు గుజరాత్ లోని శంబర్‌ కాంత నియోజకవర్గం నుండి తిరిగి ఎన్నికయ్యారు. సామ్యవాద నిర్మాణం కోసం కాంగ్రెస్ ఫోరం ప్రారంభించారు.1962 – 1963 కాలంలో కార్మిక, ఉపాధి శాఖలకు కేంద్రమంత్రిగాను, 1963 – 1966 %

No comment allowed please