Guruswami : జియో ఇనిస్టిట్యూట్ హెడ్ గా ‘గురుస్వామి’

ఆనందంగా ఉంద‌న్న నీతా అంబానీ

Guruswami  : దేశంలో పేరొందిన రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న జియో ఇనిస్టిట్యూట్ హెడ్ గా డాక్ట‌ర్ గురు స్వామి ర‌విచంద్ర‌న్(Guruswami ) నియ‌మితుల‌య్యారు. ఈ విష‌యాన్ని ఫౌండేష‌న్ చైర్మ‌న్ నీతా అంబానీ వెల్ల‌డించారు.

కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ కి చెందిన గురుస్వామి Guruswami )ప్రోవోస్ట్ గా నియ‌మించిన‌ట్లు తెలిపింది. జూలై 1న ఆయ‌న చేర‌తారు. 2015 నుంచి 2021 దాకా కాల్టెక్ లో ఇంజ‌నీరింగ్, అప్లైడ్ సైన్స్ విభాగానికి ఓటిస్ బూత్ లీడ‌ర్ షిప్ చైర్మ‌న్ గా ప‌ని చేశాడు.

2009 నుంచి 2015 దాకా కాలిఫోర్నియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ లో గ్రాడ్యుయేట్ ఏరోస్పేస్ లేబొరేట‌రీస్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశాడు. డాక్ట‌ర్ గురుస్వామి ర‌విచంద్ర‌న్ యుఎస్ఏ లోని బ్రౌన్ యూనివ‌ర్శ‌టీ నుంచి ఇంజ‌నీరింగ్ లో పీహెచ్ డీ చేశారు.

ఇంజ‌నీరింగ్ లో ఎంఎ్, తిరుచ్చి ఎన్ఐటీలో మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ చేశాడు. యుఎస్ నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ ఇంజ‌నీరింగ్ , అకాడెమియా యూరోపియా, ఇత‌ర సంస్థ‌ల‌లో కూడా స‌భ్యుడిగా ఉన్నారు.

వార్న‌ర్ టి కోయిట‌ర్ మెడ‌ల్ సాధించాడు. అమెరిక‌న్ సొసైటీ ఆఫ్ మెకానిక‌ల్ ఇంజ‌నీర్స్ , విలియం ముర్రే లెక్చ‌ర్ అవార్డు పొందారు. సొసైటీ ఫ‌ర్ ఎక్స్ ప‌రిమెంట‌ర్ మెకానిక్స్ , రిప‌బ్లిక్ ఆఫ్ ఫ్రాన్స్ వంటి ఇత‌ర అవార్డులు , పుర‌స్కారాలు పొందారు గురుస్వామి ర‌విచంద్ర‌న్.

ఈ సంద‌ర్భంగా నీతా అంబానీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గురుస్వామి రావ‌డం త‌మ‌కు సంతోషం క‌లిగిస్తోంద‌న్నారు. ఆయ‌న అపార అనుభ‌వం సంస్థ‌కు మ‌రింత మేలు చేకూరుస్తుంద‌న్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అగ్ర‌శ్రేణి సంస్థ‌లకు ధీటుగా ఎదుగుతుంద‌న్నారు నీతా అంబానీ.

Also Read : ప్ర‌పంచ కుబేరుల్లో మ‌నోడు ప‌దోడు

Leave A Reply

Your Email Id will not be published!