Harbhajan Mann : పంజాబ్ సీఎంను క‌లిసిన స్టార్ సింగ‌ర్

మాన్ ను క‌ల‌వ‌డం ఆనందంగా ఉంది

Harbhajan Mann  : భార‌త‌దేశంలో గ‌ర్వించ ద‌గిన పంజాబ్ సింగ‌ర్ల‌లో హ‌ర్భ‌జ‌న్ మాన్Harbhajan Mann )ఒక‌రు. ఆయ‌న ఒక్క‌సారి పాడ‌డం మొద‌లు పెట్టాడంటే ఊగి పోవాల్సిందే. మ‌నోడికి బెస్ట్ ఫ్రెండ్ పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్.

ఇవాళ అరుదైన స‌న్నివేశానికి వేదికైంది చండీగ‌ఢ్. సీఎం నివాసంలో హ‌ర్భ‌జ‌న్ మాన్ త‌న వారితో భ‌గ‌వంత్ మాను ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఫోటోల‌ను షేర్ చేశారు.

ప్ర‌స్తుతం ఇవి హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. భ‌గ‌వంత్ మాన్ సీఎం కాక ముందు, పాలిటిక్స్ లోకి రాక ముందు స్టాండ‌ప్ క‌మెడియ‌న్ గా త‌న కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆయ‌న చేసిన షోస్ మోస్ట్ పాపుల‌ర్ అయ్యాయి.

అంతా భ‌గ‌వంత్ మాన్ ను జ‌గ్నూ అని పిలుచుకుంటారు పంజాబీలు, దేశా వాసులు. అనుకోకుండా పాలిటిక్స్ లోకి ఎంట‌ర‌య్యాడు. ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నాడు, ఎంపీగా గెలిచాడు రెండుసార్లు.

ఆప్ నేతృత్వంలో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది ఏకంగా రాష్ట్రానికి సీఎంగా ఎన్నిక‌య్యాడు. పార్ల‌మెంట్ లోనే కాదు ఎక్క‌డికి వెళ్లినా భ‌గ‌త్ సింగ్ నిన‌దించిన ఇంక్విలాబ్ జిందాబాద్ అన‌డం ప‌రిపాటి.

సీఎం ప్ర‌మాణ స్వీకారం రోజు ప్ర‌త్యేకంగా వ‌చ్చాడు హ‌ర్బ‌జ‌న్ మాన్. మాన్ కొలువు తీరి నెల రోజులు పూర్త‌యింది. ఈ త‌రుణంలో హ‌ర్భ‌జ‌న్ మాన్ (Harbhajan Mann )క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

మేమంతా చాలా స‌మ‌యం గ‌డిపామంటూ పేర్కొన్నారు హ‌ర్బ‌జ‌న్ మాన్. ఇక హ‌ర్బ‌జ‌న్ మాన్ 1965లో పుట్టాడు. కెన‌డియ‌న్ గాయ‌కుడు. న‌టుడు, నిర్మాత‌. సినిమాతో కూడా సంబంధం క‌లిగి ఉన్నాడు. కెన‌డాలో అత‌డికి మంచి ఫాలోయింగ్ ఉంది.

Also Read : సుప్రీంకోర్టు తీర్పుపై తికాయ‌త్ కామెంట్

Leave A Reply

Your Email Id will not be published!