Harbhajan Singh : ఆ నాలుగు జట్లకే ప్లే ఆఫ్ ఛాన్స్ – భజ్జీ
జాబితాలో లేని రాజస్థాన్ రాయల్స్
Harbhajan Singh : భారత మాజీ క్రికెటర్ , ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్(Harbhajan Singh) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 16వ సీజన్ లో ఏయే జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుతాయనే దానిపై అంచనా వేశాడు. విచిత్రం ఏమిటంటే ఐపీఎల్ ఆల్ రౌండ్ షో తో ఆకట్టుకుంటున్న సంజూ శాంసన్ సేనకు చోటు దక్కలేదు. ఆ జట్టుకు అంత సీన్ లేదంటూ కొట్టి పారేశాడు.
ఏయే జట్లు చేరుకుంటాయనే దానిపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది క్రీడా వర్గాల్లో. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యే దశకు చేరుకున్నారు. ఈ తరుణంలో ప్లే ఆఫ్స్ కు ఏ జట్లు చేరుకుంటాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గత సీజన్ లో పేలవమైన ఆట తీరుతో తీవ్ర నిరాశకు గురి చేసిన ముంబై ఇండియన్స్ దుమ్మ రేపుతోంది.
ఈ సారి సీజన్ లో పక్కా ప్లే ఆఫ్స్ కు చేరుకునే జట్లను ఖరారు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్ పాండ్యా సారథ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ , మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ , ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్సీ లోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తున్న ముంబై ఇండియన్స్ చేరుకుంటాయని హర్భజన్ సింగ్ జోష్యం చెప్పాడు. ప్రస్తుతం భజ్జీ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : సత్తా చాటిన రింకూ సింగ్