Harbhajan Singh MS Dhoni: ధోనీ ఆ రాత్రి ఏడ్చాడు – భ‌జ్జీ

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన మాజీ క్రికెట‌ర్

Harbhajan Singh MS Dhoni : ఎల్ల‌ప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్, ఆప్ ఎంపీ హ‌ర్బ‌జ‌న్ సింగ్(Harbhajan Singh). ఐపీఎల్ 16వ సీజ‌న్ లో గుజ‌రాత్ ను 15 ప‌రుగుల తేడాతో ఓడించి సీఎస్కే ఫైన‌ల్ కు చేరింది. ఈ సంద‌ర్భంగా భ‌జ్జీ ధోనీ గురించి తెలియ‌ని విష‌యం పంచుకున్నాడు. ధోనీ చాలా కూల్. మైదానంలో ఎంతో ప్ర‌శాంతంగా ఉంటాడు. అందుకే అత‌డిని అంతా ఇష్ట‌ప‌డ‌తార‌ని పేర్కొన్నాడు.

భావోద్వేగాల‌ను అదుపులో ఉంచుకునే ధోనీ ఉన్న‌ట్టుండి ఓ రోజు రాత్రి ఏడ్చాడ‌ని చెప్పాడు హ‌ర్బ‌జ‌న్ సింగ్. ఈ సంఘ‌ట‌న 2018లో జ‌రిగింద‌ని చెప్పాడు. త‌న సీఎస్కే స‌హ‌చ‌రుల‌తో చుట్టు ముట్టిన సంద‌ర్బంలో ఒక్కోసారి క‌న్నీళ్లు పెట్టుకుంటాడ‌ని తెలిపాడు. హ‌ర్బ‌జ‌న్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన వీడియోను తాజాగా షేర్ చేసింది. ఇది ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఎందుకంటే భ‌జ్జీ కూడా సీఎస్కే త‌ర‌పున ఆడాడు.

అత‌డికి ధోనీతో మంచి సంబంధం ఉంది. ఐపీఎల్ బెట్టింగ్ స్కామ్ లో త‌మ ప్ర‌మేయంపై రెండు సీజ‌న్ల పాటు జ‌ట్టు స‌స్పెండ్ కు గురైంది. నిషేధం త‌ర్వాత తిరిగి ఐపీఎల్ లోకి వ‌చ్చిన‌ప్పుడు బాధ‌ను త‌ట్టుకోలేక పోయాడు ధోనీ అని చెప్పాడు. జ‌ట్టును ధోనీ త‌న కుటుంబం కంటే ఎక్కువ‌గా భావిస్తాడ‌ని తెలిపాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్.

Also Read : CSK 10th Time Final

 

Leave A Reply

Your Email Id will not be published!