Hardik Pandya : పాండ్యా రాణించినా తప్పని పరాజయం
5 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం
Hardik Pandya IPL : ఐపీఎల్ 16వ సీజన్ లో ఊహించని షాక్ తగిలింది గుజరాత్ టైటాన్స్. ఈ డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్ ఫామ్ తో కొనసాగుతోంది. పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచింది. కానీ ఉన్నట్టుండి అంచనాలు తప్పాయి. ముందుంది స్వల్ప స్కోర్. గుజరాత్ లో ఆరితేరిన బ్యాటర్లు ఉన్నారు.
అద్భుతమైన బౌలర్లు ఉన్నా ఓటమి తప్పలేదు. మరోసారి హార్దిక్ పాండ్యా(Hardik Pandya IPL) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. ఓ వైపు వికెట్లు కూలుతున్నా ఎక్కడా తగ్గలేదు. చివరి దాకా ఉన్నాడు. కానీ జట్టును గట్టెక్కించ లేక పోయాడు. 59 రన్స్ తో మరోసారి మెరిశాడు. కానీ ఫలితం లేక పోయింది.
ఇక లీగ్ మ్యాచ్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్(DC vs GT) ముందుగా బ్యాటింగ్ చేసింది. గుజరాత్ స్టార్ పేసర్ మహ్మద్ షమీ చుక్కలు చూపించాడు. ఢిల్లీ బ్యాటర్లను వణికించాడు. కేవలం 4 ఓవర్లు మాత్రమే వేసిన షమీ 4 కీలకమైన వికెట్లు తీసి కట్టడి చేశాడు. కానీ ఢిల్లీ సూపర్ విక్టరీ సాధించడంతో షమీ నిరాశకు గురయ్యాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 130 రన్స్ చేసింది. అమన్ హకీం ఖాన్ దుమ్ము రేపాడు. 44 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 3 సిక్సర్లతో 51 రన్స్ చేశాడు. అక్షర్ పటేల్ 27 రన్స్ చేశాడు. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ 3 మ్యాచ్ లలో విజయం సాధించి 6 పాయింట్లతో మరో మెట్టుకు చేరింది. అయినా ప్లే ఆఫ్ కష్టమే.
Also Read : మెరిసిన అమన్ హకీం ఖాన్