Hardik Pandya Asia Cup : హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో

పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్

Hardik Pandya Asia Cup : ఎవ‌రైనా ఒక్క‌సారి కెరీర్ లో వెన‌క్కి వెళితే మ‌ళ్లీ తిరిగి రావ‌డం చాలా క‌ష్టం. ఒక ర‌కంగా భ‌విష్య‌త్తు ఉండ‌దు. ప్ర‌త్యేకించి క్రికెట్ ను ఓ మ‌తంగా భావించే భార‌త దేశంలో విప‌రీత‌మైన పోటీ నెల‌కొంది.

గ‌తంలో ఎన్న‌డూ లేనంత‌గా ఇప్పుడు ఒక్కో ఆట‌గాడికి 10 మంది పోటీలో ఉన్నారు. అంత‌గా కాంపిటీష‌న్ పెరిగింది. ప్ర‌ధానంగా బీసీసీఐ ప్ర‌తి ఏటా

నిర్వహిస్తూ వ‌స్తున్న ఐపీఎల్ లో స‌త్తా చాటుతున్నారు.

ప్ర‌ధాన జ‌ట్టుకు పోటీ ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో కొంత కాలం పాటు గాయాలు, వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో పాటు పూర్ ప‌ర్ ఫార్మెన్స్ తో జ‌ట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా ఫీనిక్స్ ప‌క్షి లాగా తిరిగి వ‌చ్చాడు.

ఆల్ రౌండ్ షోతో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో హార్దిక్ పాండ్యా(Hardik Pandya Asia Cup) ఆక‌ట్టుకుంటున్నాడు. త‌న కెరీర్ ఒడిదుడుకుల‌కు లోనైన

స‌మ‌యంలో ఒక్క‌సారిగా రాకెట్ లా దూసుకు వ‌చ్చాడు. ఏకంగా ఐపీఎల్ లో కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ కు క‌ప్ ను అందించాడు.

ఆ త‌ర్వాత భార‌త జ‌ట్టులోకి ఎంట్రీ ఇవ్వ‌ట‌మే కాదు దుమ్ము రేపుతున్నాడు. తాజాగా యూఏఈ వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క‌ప్ 2022 లో తానేమిటో

మ‌రోసారి ప్రూవ్ చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా.

ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న‌తో బెంబేలెత్తించాడు. చివ‌రి దాకా ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ కీల‌క మ్యాచ్ లో పాకిస్తాన్ కు చుక్క‌లు చూపించాడు.

బౌలింగ్ లో 25 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 3 కీల‌క వికెట్లు తీసి ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌క్కువ స్కోర్ కే ప‌రిమితం చేశాడు.

ఇక బ్యాటింగ్ లో సైతం విరుచుకుప‌డ్డాడు.

కేవ‌లం 17 బంతులు ఆడి 4 ఫోర్లు ఓ సిక్స్ తో 33 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచి ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక‌య్యాడు.

Also Read : వాట్ ఏ విక్ట‌రీ – రాహుల్..ప్రియాంక‌

Leave A Reply

Your Email Id will not be published!