Hardik Pandya Amit Shah : ‘షెహ‌న్’ షాతో పాండ్యా బ్ర‌ద‌ర్స్ భేటీ

క‌ల‌యిక వెనుక మ‌త‌ల‌బు ఏంటో

Hardik Pandya Amit Shah : హార్దిక్ పాండ్యా ఇప్పుడు భార‌త క్రికెట్ లో ఎక్కువ‌గా వినిపిస్తున్న పేరు. ఈ ఏడాది ఈ క్రికెట‌ర్ కు బాగా క‌లిసొచ్చింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టు కోలేక పోయిన పాండ్యాకు ఊహించ‌ని రీతిలో బిగ్ ఛాన్స్ ద‌క్కింది. అదే గుజ‌రాత్ టైటాన్స్ కు సార‌థి కావ‌డం.

దేశ వ్యాప్తంగా విస్తు పోయింది హార్దిక్ ను(Hardik Pandya) నియ‌మించ‌డం. కానీ ఈసారి అనూహ్యంగా ఐపీఎల్ తెర మీద ప్ర‌త్య‌క్షం అయ్యాడు. త‌న స‌త్తా ఏమిటో చూపించాడు. కెప్టెన్ గా త‌న‌ను తాను నిరూపించాడు. ద‌గ్గ‌రుండి కొత్త‌గా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన గుజ‌రాత్ టైటాన్స్ ను ఏకంగా ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిపాడు.

దీని వెనుక అమిత్ షా మంత్రాంగం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. అప్ప‌టి దాకా అద్భుతంగా ఆడుతూ వ‌చ్చిన సంజూ శాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు ఫైన‌ల్ లో గుజ‌రాత్ టైటాన్స్ తో చ‌తికిల ప‌డ‌డం జీర్ణించు కోలేక పోతున్నారు. ప్ర‌స్తుతం దేశంలో గుజ‌రాత్ రాష్ట్రానికి చెందిన వారిదే హ‌వా న‌డుస్తోంది.

ఐపీఎల్ గెలుపు సాధించిన బూస్ట్ తో భార‌త జ‌ట్టు లో చోటు సంపాదించాడు. అద్బుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నాడు పాండ్యా(Hardik Pandya). చివ‌ర‌కు టీమిండియా కెప్టెన్ గా టీ20 ఫార్మాట్ కు ఎంపిక‌య్యాడు. త్వ‌ర‌లో వ‌న్డేకు కూడా సార‌థి కానున్న‌ట్లు టాక్.

ఇదే స‌మ‌యంలో ట్రబుల్ షూట‌ర్ గా పేరొందిన అమిత్ షాను క‌ల‌వ‌డంలో ఉన్న ఆంత‌ర్యం ఏమిటో అర్థం కాలేదు. అయితే తాను , సోద‌రుడు కృనాల్ పాండ్యా క‌లిసిన ఫోటోల‌ను షేర్ చేశాడు స్వ‌యంగా.

Also Read : పంత్ ప్ర‌ముఖ క్రికెట‌ర్ అని తెలియ‌దు

Leave A Reply

Your Email Id will not be published!