Hardik Pandya : ప్రతి ఆటగాడు మ్యాచ్ విన్నరే – పాండ్యా
ప్రతి ఆటగాడు మ్యాచ్ విన్నరే - పాండ్యా
Hardik Pandya : రాజస్తాన్ రాయల్స్ ను 7 వికెట్ల తేడాతో మట్టి కరిపించి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 క్రికెట్ చాంపియన్ గా నిలిచింది. విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ఆనందాన్ని పంచుకున్నాడు.
తన క్రికెట్ కెరీర్ లో ఇది మరిచి పోలేని చిరస్మరణీయమైన విజయంగా అభివర్ణించాడు. గత రెండేళ్లుగా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నా.
కానీ నా కుటుంబం, ప్రత్యేకించి నా సోదరుడు అందించిన సహకారం మరిచి పోలేను. ఓటమికి కుంగి పోవడం, గెలిస్తే పొంగి పోవడాన్ని నేను పాటించ లేదు.
ఆటను ఆటగానే చూశా. ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) లో అనుకోకుండా అవకాశం దక్కింది. దీనిని నిరూపించుకునే చాన్స్ మేనేజ్ మెంట్ ఇచ్చింది.
నాతో పాటు సహచరులు, సీనియర్లు, జూనియర్లు, ప్రత్యేకించి హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఇలా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరు సహకరించారు. వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya). లీగ్ లో 14 మ్యాచ్ లు ఆడాం. అందులో 4 మ్యాచ్ లలో ఓడి పోయాం.
గెలిచినప్పుడు ఏం చేశామో , ఓడి పోయినప్పుడు ఎలాంటి తప్పులు చేశామో దగ్గరుండి చూసుకున్నాం. మా బలాలు ఏమిటో బలహీనతలు ఏమిటో గుర్తించగలిగాం.
ఇదే సమయంలో జట్టులోని ప్రతి ఆటగాడు ఓ మ్యాచ్ విన్నర్ లా మారడం మాకు కలిసొచ్చిన అంశమని పేర్కొన్నాడు. అంతే కాదు పాజిటివ్ దృక్ఫథమే తమను విజేతలుగా నిలిచేలా చేసిందన్నాడు పాండ్యా(Hardik Pandya).
Also Read : అద్భుత విజయం సమిష్టి ఫలితం