Hardik Pandya : మా లక్ష్యం వరల్డ్ కప్ గెలవడం – పాండ్యా
కొత్త ఏడాదిలో సాధిస్తామన్న టీ20 కెప్టెన్
Hardik Pandya : భారత టీ20 జట్టు సారథి హార్దిక్ పాండ్యా(Hardik Pandya) షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇవాళ్టితో కొత్త ఏడాది 2023లో భారత జట్టు క్రికెట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వాంఖడే స్టేడియంలో దాయాది శ్రీలంక జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. మూడు టీ20 మ్యాచ్ ల సీరీస్ కు పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ.
ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే న్యూజిలాండ్ లో సీరీస్ కూడా గెలిచాడు. శ్రీలంకతో సీరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు హార్దిక్ పాండ్యా. తన కెరీర్ లో గత ఏడాది సంతోషంగా గడిచిందని చెప్పాడు. ఐపీఎల్ లో ఎంట్రీ తోనే ఛాంపియన్ షిప్ సాధించామని, ఈసారి మాత్రం తనకు ఓ కల ఉందని అది భారత దేశంలో జరగబోయే వన్డే వరల్డ్ కప్ ను సాధించడమే తమ అంతిమ లక్ష్యమని స్పష్టం చేశాడు.
రాబోయే మెగా టోర్నీలో సత్తా చాటుతామని, ఆ దిశగా ప్రయత్నం చేస్తామని అన్నాడు హార్దిక్ పాండ్యా(Hardik Pandya) . కచ్చితంగా భారత్ గెలుస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు. అన్ని ఫార్మాట్ లలో ఆడగలిగే సత్తా కలిగిన ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో ఉన్నారని చెప్పాడు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నాడు.
ఎందుకంటే భారత్ లోనే కప్ నిర్వహించడం మన జట్టుకు అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తంచేశాడు పాండ్యా. ఇదిలా ఉండగా బీసీసీఐ ఇప్పటికే వరల్డ్ కప్ కోసం షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. కానీ ఇంకా ప్రకటించ లేదు.
Also Read : భారత్ సిద్దం లంక సన్నద్ధం