Hardik Pandya Pant : హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టేశారు
హాంకాంగ్ తో మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చారు
Hardik Pandya Pant : యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ -2022 టోర్నీలో(Asia Cup 2022) అనూహ్యంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు హార్దిక్ పాండ్యా.
25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. 17 బంతులు మాత్రమే ఎదుర్కొని 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గెలవని మ్యాచ్ ను భారత్ వశం అయ్యేలా చేశాడు. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాడు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు విన్నర్ గా నిలిచాడు. ఇదిలా ఉండగా అందరికీ షాక్ ఇస్తూ టీమ్ మేనేజ్ మెంట్ హార్దిక్ పాండ్యాను పక్కన పెట్టింది.
అతడికి రెస్ట్ ఇచ్చామని చెప్పాడు భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma). ఇందులో ఎలాంటి రాజకీయం లేదని స్పష్టం చేశాడు. దంతో పాండ్యా అభిమానులను షాక్ కు గురి చేసింది.
ఆల్ రౌండర్ లేకుండా ఎందుకు ఎంపిక చేశారంటూ మండిపడుతున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ బీసీసీఐ సెలెక్షన్ టీంను, కెప్టెన్ రోహిత్ శర్మను ఏకి పారరేస్తున్నారు.
ఇదిలా ఉండగా హాంగ్ కాంగ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ కు హార్దిక్ పాండ్యాకు బదులు రిషబ్ పంత్(Hardik Pandya Pant) ను తీసుకున్నామని చెప్పాడు కెప్టెన్.
కాగా మ్యాచ్ విషయానికి వస్తే హాంకాంగ్ కెప్టెన్ నిజాకత్ ఖాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బరిలోకి దిగింది. తర్వాతి మ్యాచ్ లలో హార్దిక్ పాండ్యా అవసరమని రెస్ట్ ఇవ్వడం జరిగిందన్నాడు రోహిత్ శర్మ.
Also Read : అబ్బా ‘సూర్యా’ భాయ్ దెబ్బ