Hardik Patel : ఈ ఏడాది చివరలో గుజరాత్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వేయాలని చూస్తోంది. ఇటీవల దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవి చూసింది.
ఇక పంజాబ్ లో అధికారంలో ఉన్న పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో ఆప్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే యాక్షన్ లోకి దిగింది.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో అంతర్గత సమస్యలతో సతమతం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా గుజరాత్ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న హార్దిక్ పటేల్ సంచలన కామెంట్స్ చేశారు.
రాష్ట్ర పార్టీకి చెందిన నాయకులు కొందరు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాను పార్టీ విడిచి వెళ్లాలని చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు హార్దిక్ పటేల్.
ఈ విషయం గురించి కాంగ్రెస్ హై కమాండ్ కు ఫిర్యాదు చేసినా తనను పట్టించు కోవడం లేదని మండిపడ్డారు. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశానని కానీ ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ఇదిలా ఉండగా పార్టీ హైకమాండ్ రాష్ట్రంలో ప్రముఖుడిగా పేరొందిన నరేష్ పటేల్ ను పార్టీలో చేర్చు కోవాలని ప్లాన్ చేస్తోంది.
దీనిపై ఆయన మండి పడుతున్నారు. గత ఎన్నికల్లో తనను వాడుకున్నారని ఇప్పుడు ఇంకో పటేల్ వైపు చూస్తున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు.
Also Read : రేపు మంత్రి పదవికి రాజీనామా చేస్తా