Harish Rao : కేసీఆర్ ఆరోగ్యం కోసం ప్రార్థించండి
మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు
Harish Rao : హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ నిన్న రాత్రి ఫామ్ హౌస్ లోని బాత్రూంలో పడి పోయారు. ఆయనను హుటా హుటిన నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన తుంటి ముక్క విరిగిందని, త్వరలోనే శస్త్ర చికిత్స చేస్తారని సమాచారం.
Harish Rao Comment on KCR Health
కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆరోగ్య కార్యదర్శి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ , కేసీఆర్ అభిమానులు యశోద ఆస్పత్రికి తరలి వస్తున్నారు.
దీంతో తన మామ ఆరోగ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే యశోద ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేసీఆర్ ను పరామర్శించిన అనంతరం హరీశ్ రావు(Harish Rao) శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
ఇవాళ తుంటి మార్పిడి ఆపరేషన్ జరుగుతుందన్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 లేదా 8 వారాల సమయం పడుతుందని చెప్పారు. ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని , ఎవరూ కూడా ఆస్పత్రి వద్దకు రావద్దని సూచించారు. ఎవరైనా సరే ఇంటి వద్ద నుండి ప్రార్థనలు చేయాలని కోరారు హరీశ్ రావు.
Also Read : CM Revanth Reddy : సీఎండీ తీరుపై సీఎం సీరియస్