Praja Darbhar : హైదరాబాద్ – తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరాక సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ప్రజా దర్బార్ చేపట్టారు. వందలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దగ్గరుండి విజ్ఞాపనలను తీసుకున్నారు రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు నీటి పారుదల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.
Praja Darbhar Updates
తాను సీఎంగా కొలువు తీరిన వెంటనే ప్రతి వారం వారం ప్రజా దర్బార్ చేపడతానని ప్రకటించారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఆయన చెప్పినట్టుగానే ఇవాళ ఆ పని చేశారు. అంతకు ముందు సామాన్యులు ఎవరూ రాకుండా ఇనుప కంచెలు వేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. తాను సీఎంగా కొలువు తీరిన వెంటనే వాటిని తీయించి వేస్తానని చెప్పారు. చెప్పినట్టు చేశారు. ఇవాళ నగర వాసులు, వాహనదారులు పెద్ద ఎత్తున ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా దర్బార్ లో ప్రజల నుంచి వచ్చిన వినతులకు సంబంధించి మొత్తం 20 మంది అధికారులను ఏర్పాటు చేశారు. ఏయే జిల్లాల నుంచి వచ్చారు. వారు విన్నవించిన సమస్య ఏమిటి, ఎప్పుడు ఇచ్చారు. ఎందుకు చర్యలు తీసుకోలేదనే దానిపై పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి.
Also Read : Harish Rao : కేసీఆర్ ఆరోగ్యం కోసం ప్రార్థించండి
