Harmanpreet Kaur : భారతీయ క్రికెట్ నియంత్రణ మండలి – బీసీసీఐ సెలెక్షన్ కమిటీ న్యూజిలాండ్ లో పర్యటించే భారత మహిళల టీ20 క్రికెట్ టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ఇవాళ అధికారికంగా వెల్లడించింది.
వచ్చే నెల ఫిబ్రవరి లో పర్యటించి భారత మహిళా టీంకు సంబంధించి 16 మంది సభ్యులను ఎంపిక చేసింది. ఇందుకు సంబంధించి టీమిండియా టీ20 జట్టుకు సారథిగా హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) ను నియమించింది.
ఫిబ్రవరి 9న జరిగే ఏకైక టీ20 మ్యాచ్ కు గాను అన్ని ఫార్మాట్ లలో ఆడిన ప్లేయర్లను పరిగణలోకి తీసుకుని ఎంపిక చేసింది. ఇక మహిళల జట్టు కు సంబంధించి హర్మన్ ప్రీత్ కౌర్ కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తే స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది.
ఇక జట్టు పరంగా చూస్తే షఫాలీ వర్మ, యాస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ – వికెట్ కీపర్ కాగా స్నేహ రాణా, పూజా వస్త్రాకర్ , మేఘనా సింగ్ , రేణుక సింగ్ ఠాకూర్ , తానియా భాటియా – వికెట్ కీపర్ , రాజేశ్వరి గైక్వాడ్ , పూనమ్ యాదవ్ , ఏక్తా బిష్త్ , ఎస్. మేఘన, సిమ్రాన్ దిల్ బహదూర్ ఉన్నారు.
మరో వైపు మార్చి లో ప్రారంభమయ్యే వరల్డ్ కప్ కోసం కూడా పర్మినెంట్ టీంను ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా ప్రముఖ స్టార్ ప్లేయర్ , వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారణి హైదరాబాద్ కు చెందిన మిథాలీ రాజ్ కు బాధ్యతలు అప్పగించింది.
ఇందుకు గాను పర్మినెంట్ టీంతో పాటు స్టాండ్ బై ఆటగాళ్లను ఎంపిక చేసింది. కాగా కీవీస్ టూర్ కు సంబంధించి ఎంపికైన టీం వెళ్లనుంది త్వరలో.
Also Read : ‘రాజపక్స’ నిర్ణయం వెనక్కి తీసుకో