Harmanpreet Kaur : వారెవ్వా కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
30 బంతులు 14 ఫోర్లు 65 రన్స్
Harmanpreet Kaur MI : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ తాజాగా ప్రపంచ క్రికెట్ లో తొలిసారిగా ప్రారంభించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో సత్తా చాటింది. రికార్డుల మోత మోగించిన ఆస్ట్రేలియా కెప్టెన్ బెత్ మూనీ సారథ్యం వహిస్తున్న గుజరాత్ జెయింట్స్ కు చుక్కలు చూపించింది.
ముంబై ఇండియన్స్ కు నాయకత్వం వహిస్తున్న హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur MI). సమిష్టిగా కృషి చేస్తే ఎంతటి బలమైన జట్టు అయినా తల వంచాల్సిందేనని నిరూపించింది. టాస్ గెలిచిన బెత్ మూనీకి కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది. టాస్ ఓడి పోయి ముందుగా మైదానంలోకి దిగిన హర్మన్ ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) సేన మొదట్లోనే వికెట్ కోల్పోయినా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.
తొలి సీజన్ లో తనకు ఎదురే లేదని చాటింది. కేవలం 30 బంతులు మాత్రమే ఎదుర్కొన్న హర్మన్ ప్రీత్ కౌర్ ఏకంగా 14 ఫోర్లు కొట్టింది. మొత్తం 65 పరుగులు చేసింది. దీంతో ఆ జట్టు భారీ స్కోర్ నమోదు చేయడంతో గుజరాత్ జెయింట్స్ తల వంచక తప్పలేదు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకుంది ముంబై ఇండియన్స్ కెప్టెన్.
ముంబై వేదికగా జరిగిన ఈ తొలి లీగ్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఎనలేని ఎంజాయ్ ని మిగిల్చింది. అంతకు ముందు ముంబై తారల తళుకు బెళుకులతో ప్రారంభమైంది. మొత్తంగా బీసీసీఐ చేసిన ఈ ప్రయత్నం భారీగా సక్సెస్ అయ్యిందని చెప్పక తప్పదు.
Also Read : ముంబై దెబ్బకు గుజరాత్ విలవిల