Harmanpreet Kaur Lead : టీ20 వరల్డ్ కప్ మహిళా జట్టు డిక్లేర్
హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ..వైస్ కెట్టెన్ మంధాన
Harmanpreet Kaur Lead : వచ్చే ఏడాది 2023 టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత మహిళా క్రికెట్ జట్టును ప్రకటించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). హర్మన్ ప్రీత్ కౌర్ కు(Harmanpreet Kaur) సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఇక టాప్ లో కొనసాగుతున్న స్మృతి మంధానను వైస్ కెప్టెన్ గా నియమించింది. ఇక ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ , వెస్టిండీస్ , పాకిస్తాన్ , ఐర్లాండ్ లతో పాటు టీమిండియా గ్రూప్ -2లో ఉంది. శిఖా పాండేను తిరిగి ఎంపిక చేసింది.
ఇదిలా ఉండగా ఆల్ ఇండియా ఉమెన్స్ సెలెక్షన్ కమిటీ సమావేశమైంది. దక్షిణాఫ్రికాలో జనవరిలో ప్రారంభమయ్యే ట్రై సీరీస్ , రాబోయే ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2023 కోసం భారత జట్టును ఎంపిక చేసింది. ప్రపంచ కప్ ఫిబ్రవరి 10న ప్రారంభం కానుంది. 12న పాకిస్తాన్ తో టీమ్ ఇండియా తలపడనుంది. గ్రూప్ దశ ముగిసే సమయానికి ఒక్కో గ్రూప్ లో మొదటి, రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ లో ఆడతాయి. ఫైనల్ ఫిబ్రవరి 26న జరుగుతుందని బీసీసీఐ వెల్లడించింది.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ జట్టు ఇలా ఉంది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ , స్మృతీ మంధాన వైస్ కెప్టెన్ , షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, రిచా ఘోష్ , జెమీమా రోడ్రిగ్స్ , హర్లీన్ డియోల్ , దీప్తి శర్మ, రాధా యాదవ్ , రేణుకా ఠాకూర్ , అంజలి సర్వాణి, పూజా వస్త్రాకర్ , రాజేశ్వరి గైక్వాడ్ , శిఖా పాండే ఉన్నారు.
ఇక రిజర్వ్ ఆటగాళ్లలో సబ్బినేని మేఘన, స్నేహ రాణా, మేఘానా సింగ్ ను ఎంపిక చేశారు.
ట్రై సీరీస్ కోసం టీమిండియాకు హర్మన్ ప్రీత్ కౌర్ సారథిగా వ్యవహరిస్తారు. స్మృతి మంధాన ఉప సారథి కాగా , యాస్తికా భాటియా, జెమీమా, హర్షల్ , దీప్తి శర్మ, దేవికా వైద్య, రాజేశ్వరి, రాధా యాదవ్ , రేణుకా సింగ్ , మేఘనా , అంజలి , శుష్మా , అమంజోత్ కౌర్, పూజా , మేఘన, స్నేహ రాణా, శిఖా పాండే ఉన్నారు.
Also Read : శ్రీలంక టీ20..వన్డే జట్ల ఎంపిక