ఐపీఎల్ 16వ సీజన్ నుంచి డేవిడ్ వార్నర్ సేన నిష్క్రమించింది. పంజాబ్ చేతిలో 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 167 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆరంభంలో అదుర్స్ అనిపించింది. ఒకానొక దశలో 69 పరుగులకు ఒక్క వికెట్ కోల్పోలేదు.
కానీ ఆ వెంటనే సీన్ మారింది. ఎప్పుడైతే పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ శిఖర్ ధావన్ హర్ ప్రీత్ బ్రార్ ను బౌలింగ్ చేసేందుకు ఛాన్స్ ఇచ్చాడో సీన్ పూర్తిగా మారి పోయింది. గెలుపు ఆశలపై పూర్తిగా నీళ్లు చల్లాడు. 4 ఓవర్లు వేసి 30 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఓ వైపు ప్రభ్ సిమ్రన్ సింగ్ సూపర్ సెంచరీతో దంచి కొట్టాడు. సామ్ కరన్ ఒక్కడే 20 పరుగులతో రాణించాడు. ఢిల్లీ బౌలర్లు పంజాబ్ కింగ్స్ ను కట్టడి చేసినా ఫలితం లేకుండా పోయింది.
కెప్టెన్ వార్నర్ , ఫిల్ సాల్ట్ అద్భుతంగా ఆడినా ఆ తర్వాత కేవలం 16 పరుగుల తేడాతో 6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్ . చేజేతులారా మ్యాచ్ ను పోగొట్టుకుంది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ రేసులోకి దూసుకు వెళ్లింది.
