Naseeruddin Shah : విద్వేష ప్ర‌చారం దేశానికి ప్ర‌మాదం

మోదీ చొర‌వ తీసుకోవాల‌న్న న‌సీరుద్ద‌న్ షా

Naseeruddin Shah : ప్ర‌వ‌క్త మ‌హ్మ‌ద్ పై అనుచిత వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. భార‌త దేశం బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప్ర‌పంచంలోని 57 ముస్లిం దేశాలు ముక్త‌కంఠంతో కోరుతున్నాయి.

దీనిపై ఇప్ప‌టికే కేంద్రం వివ‌ర‌ణ ఇచ్చింది. వ్య‌క్తులు చేసిన కామెంట్స్ కు దేశం ఎలా బాధ్య‌త వ‌హిస్తుంద‌ని ప్ర‌శ్నించింది. ఇది పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త అభిప్రాయం మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది.

భార‌త దేశం అన్ని మ‌తాల‌ను, కులాల‌ను, వ‌ర్గాల‌ను, ప్రాంతాల‌ను స‌మానంగా చూస్తుంద‌ని పేర్కొంది. అయినా ర‌గ‌డ ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే కామెంట్స్ చేసిన బీజేపీకి చెందిన నూపుర్ శ‌ర్మ‌, న‌వీన్ జిందాల్ ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది.

దేశ వ్యాప్తంగా విద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేసిన ప‌లువురు నేత‌ల‌పై ఢిల్లీ పోలీసులు కేసులు న‌మోదు చేశారు. వీరిలో హిందూ, ముస్లిం వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కులు ఉండ‌డం విశేషం.

ఇక నూపుర్ శ‌ర్మ‌తో చ‌ర్చా వేదిక‌లో పాల్గొన్న సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ స‌బా న‌ఖ్వీపై కూడా కేసు న‌మోదు కావ‌డాన్ని జ‌ర్న‌లిస్టులు త‌ప్పు ప‌డుతున్నారు.

తాజాగా చోటు చేసుకున్న ఈ వివాదంపై ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు న‌సీరుద్దీన్ షా(Naseeruddin Shah) స్పందించారు. ఈ విద్వేష పూరిత ప్ర‌చారం దేశానికి అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు.

దీనిని ఎంత త్వ‌ర‌గా వీలైతే అడ్డుకట్ట వేయాల‌ని, ముందుగా చ‌ర్య‌లు తీసుకోవాల్సింది దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు న‌టుడు.

విద్వేష భావ జాలాన్ని వ్య‌క్తం చేస్తున్న వారిలో ముందుగా విజ్ఞ‌త నెల‌కొల్పేలా చూడాల‌ని సూచించారు. లేక పోతే మిడి మిడి జ్ఞానం వ‌ల్ల స‌మాజానికి చేటు తెస్తుంద‌న్నారు.

Also Read : పూజా హెగ్డే కు క్ష‌మాప‌ణ చెప్పిన ఇండిగో

Leave A Reply

Your Email Id will not be published!