Mamata Banerjee Gandhi : ‘బెంగాల్ బెబ్బులి పులి’ హ్యాట్సాఫ్
మోదీకి చుక్కలు చూపిస్తున్న దీదీ
Mamata Banerjee Gandhi : దేశంలో రాచరిక పాలన సాగిస్తూ, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ బీజేపీయేతర రాష్ట్రాలు, సీఎంలు, మంత్రులు, సంస్థలను టార్గెట్ చేస్తూ వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చుక్కలు చూపిస్తోంది టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ బెబ్బులి పులి గా పేరొందిన సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee Gandhi) .
ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిని ఓడించాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే విపక్షాలతో మాట్లాడింది. నిన్నటి దాకా బీరాలు పలికిన
ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖం చాటేశారు.
ఇక బీజేపీకి బి టీంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఐఎం దూరంగా ఉంది. ఈ తరుణంలో అనూహ్యంగా దీదీ ఢిల్లీలో నిర్వహించిన కీలక మీటింగ్ కు 17 పార్టీల నేతలు హాజరయ్యారు.
ఈ సమావేంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవర్ బయటకు విమర్శలు చేస్తున్నా లోలోపట మోదీకి సపోర్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
దీంతో ఆయన హాజరైనా తాను బరిలో ఉండనని తేల్చేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో నిజాయితీ కలిగిన ఆఫీసర్ గా,
గతంలో గవర్నర్ గా, సెక్రటరీగా, హై కమిషనర్ గా, పలు సంస్థలకు చైర్మన్ గా , ప్రొఫెసర్ గా, నిజాయితీ కలిగిన మేధావిగా పేరొందిన మహాత్మా గాంధీ మనవడు గోపాల కృష్ణ దేవదాస్ గాంధీ(Mamata Banerjee Gandhi) ని ప్రతిపాదించింది రాష్ట్రపతి పదవి కోసం.
ఆయనతో పాటు ఫరూఖ్ అబ్దుల్లా పేరును కూడా పరిశీలించాలని కోరింది. ఏది ఏమైనా ఈ బెంగాల్ బెబ్బులి తీసుకునే నిర్ణయాలకు అంతా ఓకే చెప్పారు.
విచిత్రం ఏమిటంటే ఉప్పు నిప్పు లాగా ఉన్నప్పటికీ దీదీ సమావేశానికి కాంగ్రెస్ హాజరైంది. మమతా బెనర్జీ ప్లాన్ కు దిమ్మ దిరిగి పోయింది బీజేపికి.
ఎందుకంటే ఇప్పటికే గాంధీని చంపిన గాడ్సే ఆర్ఎస్ఎస్ కు చెందిన వ్యక్తి. ఇదే సమయంలో గాంధీ స్వంత మనవడికి వ్యతిరేకంగా అభ్యర్థిని
నిలబెడితే అది పూర్తిగా ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది.
ఒక వేళ విపక్షాలన్నీ కలిసికట్టుగా గోపాల కృష్ణ గాంధీని గనుక ప్రతిపాదిస్తే ఎన్డీయే అభ్యర్థి గెలుపొందేందుకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది.
Also Read : రాష్ట్రపతి రేసులో ‘గాంధీ..ఫరూక్’