Hayley Matthews : హేలీ మ్యాథ్యూస్ జోర్దార్ ఇన్నింగ్స్
38 బాల్స్ 13 ఫోర్లు 1 సిక్సర్ 77 రన్స్
Hayley Matthews RCB vs MI : ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో విజయాన్ని(RCB vs MI) నమోదు చేసింది.
వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయిన భారత స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఆశించిన మేర రాణించ లేదు. అందరి కళ్లు ఆమెపై ఉండగా మంధాన మాత్రం చిన్న స్కోర్లకే పరిమితం కావడం, నాయకత్వ లోపం ఆర్సీబీకి శాపంగా మారింది. మరో వైపు ఆర్సీబీ యాజమాన్యం ఏరికోరి టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది. ఏదీ వర్కవుట్ కాలేదు.
ఇక పంజాబ్ కు చెందిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంటోంది. తాజాగా ఆర్సీబీతో జరిగిన కీలక పోరులో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. ఏకంగా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది తనకు ఎదురే లేదని సత్తా చాటింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 155 రన్స్ కే పరిమితమైంది. అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఒక్క వికెట్ నష్ట పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించింది హేలీ మ్యాథ్యూస్(Hayley Matthews RCB vs MI) . కేవలం 38 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు 1 సిక్సర్ తో 77 రన్స్ చేసింది. చివరికి నాటౌట్ గా నిలిచింది. అంతే కాదు ప్రత్యర్థి జట్టును పరుగులు చేయనీయకుండా కట్టడి చేసింది. 3 కీలక వికెట్లు తీసింది. జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించి ఆల్ రౌండ్ షో ప్రదర్శించిన హేలీ మ్యాథ్యూస్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.
Also Read : సానియా మీర్జాకు ఘనంగా వీడ్కోలు