HCA Election : హెచ్‌సీఏ ఎన్నిక‌ల న‌గారా

ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల ఆఫీస‌ర్

HCA Election : హైద‌రాబాద్ – వివాదాల మ‌ధ్య ఎట్ట‌కేల‌కు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (HCA) కు సంబంధించి ఎన్నిక‌ల న‌గారా మోగింది. ఇప్ప‌టి వ‌ర‌కు అసోసియేష‌న్ కు చీఫ్ గా అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్.

అధ్య‌క్షుడికి, కార్య‌వ‌ర్గానికి మ‌ధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు వ‌చ్చాయి. దీంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. అసోసియేష‌న్ కు ప్ర‌త్యేక ఎన్నిక‌ల అధికారిగా సంతోష్ కుమార్ ను నియ‌మించింది.

HCA Election Viral

ప్ర‌స్తుతం ఈ ఏడాది ఇంటర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023ని నిర్వ‌హిస్తోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో ప‌లు మ్యాచ్ లు నిర్వ‌హించనుంది.

తాజాగా హెచ్ సీ ఏ ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేష‌న్ జారీ చేసింది ఎన్నిక‌ల అధికారి వి. సంత‌ప్ కుమార్. 173 మందితో కూడిన ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేశారు. ఈ ఎన్నిక‌ల‌లో అధ్య‌క్షుడు, ఉపాధ్య‌క్షుడు, కార్య‌ద‌ర్శి, స‌హాయ కార్య‌ద‌ర్శి, కోశాధికారి పోస్టుల‌కు ఎన్నిక‌లు జ‌ర‌ప‌నున్నారు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా అక్టోబ‌ర్ 11 నుండి 13వ తేదీ వ‌ర‌కు నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. 14న నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. 16 వ‌ర‌కు ఛాన్స్ ఇచ్చారు. అక్టోబ‌ర్ 20న హెచ్ సీ ఏ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు ఎన్నిక‌ల అధికారి..

Also Read : Appalayagunta Utsavalu : శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌రుడి ఉత్స‌వాలు

Leave A Reply

Your Email Id will not be published!