HCA Election : హెచ్‌సీఎ ఎన్నిక‌ల‌పై ఉత్కంఠ‌

173 మందికి ఓటు హ‌క్కు

HCA Election : హైద‌రాబాద్ – అంద‌రి క‌ళ్లు ఇప్పుడు హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఎ ) ఎన్నిక‌ల‌పై ప‌డ్డాయి. దీనికి కార‌ణం దేశంలో ఎక్క‌డా లేని రీతిలో ఇక్క‌డ ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు, కేసులు, అక్ర‌మాలు, స్కాంలు కొన‌సాగాయి. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజాహ‌రుద్దీన్ హెచ్‌సీఎ కు అధ్య‌క్షుడిగా ఉన్నారు. ఆయ‌న ఉన్నా సీన్ మార‌లేదు. అంత‌క‌న్నా ఎక్కువ‌గా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి.

HCA Election Viral

దీంతో హైకోర్టుకు చేరింది ఈ వ్య‌వ‌హారం. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. హెచ్ సీ ఏకు పూర్తి కార్య‌వ‌ర్గాన్ని ర‌ద్దు చేసింది. ప్ర‌త్యేక అధికారిని నియ‌మించింది. తాజాగా పాల‌క వ‌ర్గం గ‌డువు ముగియ‌డంతో ఎన్నిక‌లు చేప‌ట్టేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసింది.

శుక్ర‌వారం హెచ్ సీఏకు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌రో వైపు స్పెష‌ల్ ఆఫీస‌ర్ సంస్థ‌లో అవినీతి , అక్ర‌మాలు చోటు చేసుకున్నాయంటూ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ఈ త‌రుణంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌డం విశేషం.

ఉప్ప‌ల్ స్టేడియంలో రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ వీఎస్ సంప‌త్ సమ‌క్షంలో హెచ్‌సీఎ(HCA) ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 173 మంది ఓటు వేయ‌నున్నారు. వీరంతా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌లను ఎన్నుకోనున్నారు. ఇవాళే రిజ‌ల్ట్స్ ప్ర‌క‌టిస్తారు.

Also Read : BRS Joinings : బీఆర్ఎస్ లో నేత‌ల జంప్

Leave A Reply

Your Email Id will not be published!