HD Kumara Swamy : దేశ వ్యాప్తంగా ఒకే భాష ఉండాలన్న తలంపుతో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో విద్యా విధానాన్ని కాషాయీకరణ చేస్తోందంటూ ఇప్పటికే విపక్షాలు మండి పడుతున్నారు.
ఈ తరుణంలో తమిళనాడులో కూడా హిందీని రుద్దే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు ఆ రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్.
ఇదే క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇంగ్లీష్ కు ప్రత్యామ్నాయంగా హిందీని వాడాలని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
తాజాగా అదే రాష్ట్రానికి చెందిన మాజీ సీఎం కుమార స్వామి బీజేపీపై, అమిత్ షా పై నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తీసేందుకు ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
హిందీకి ప్రాధాన్యత ఇస్తూ వ్యక్తిగత ఎజెండాను నడుపుతోందంటూ ఆరోపించారు. దీనిని ఎంత మాత్రం కన్నడిగులు ఒప్పుకోరన్నారు. ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. దీని వెనుక రాజకీయం తప్ప మరొకటి లేదని పేర్కొన్నారు కుమార స్వామి(HD Kumara Swamy).
ప్రజలే వారికి గుణపాఠం చెబుతారని కేంద్రంపై మండిపడ్డారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం, హోం శాఖ మంత్రి షా తమ వ్యక్తిగత ఎజెండాలను బలవంతంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేయడం మానుకోవాలన్నారు.
ప్రజలే వారికి గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. హిందీ భాష తమ భాష కాదన్నారు సిద్దరామయ్య.
Also Read : శివసేన లీడర్ జాదవ్ ఆస్తులు జప్తు