Jasprit Bumrah : ఎవరన్నారు విరాట్ కోహ్లీ లీడర్ కాదని. ఆయన ఎల్లప్పటికీ మాకు నాయకుడిగానే ఉంటాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత స్టార్ ప్లేయర్ జస్ ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah). ఒక లీడర్ కు ఉండాల్సిన లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయని పేర్కొన్నాడు.
గత ఏడున్నర ఏళ్లుగా గాడి తప్పిన భారత జట్టుకు జవసత్వాలు కల్పించిన ఘనత కోహ్లీదేనని కొనియాడారు. ఎవరూ ఎళ్లకాలం ఉండరనేది యాధృశ్చికమే అయినా ఇందులో బాధ పడాల్సింది ఏమీ లేదని పేర్కొన్నాడు.
ఒక్కో ఆటగాడిది ఒక్కో స్టైల్. విరాట్ కోహ్లీ మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇలాంటి క్రికెటర్ ఉండడం దేశం చేసుకున్న పుణ్యమంటూ కితాబు ఇచ్చాడు. ఎక్కడా ఓటమి అంటూ ఒప్పుకోని మనస్తత్వం అతడి సొంతమన్నాడు.
వర్ధమాన ఆటగాళ్లకు ఆయన ఓ నడిచే వికీ పీడియా అని ప్రశంసలతో ముంచెత్తాడు. నాయకత్వం అన్నది మారవచ్చు. కానీ ప్లేయర్లు మాత్రం మారరు. ఒకరి తర్వాత ఇంకొకరు రావచ్చు.
ఇది ఆటలో భాగం. కానీ కోహ్లీ సాధించిన విజయాలు మాత్రం ఎల్లప్పటికీ చిరస్మరణీయంగా ఉంటాయని స్పష్టం చేశాడు జస్ ప్రీత్ బుమ్రా. ఎలాంటి క్లిష్ట సమయం ఎదురైనా సరే ఎలా ఎదుర్కోవాలని మధనపడే ఆటగాళ్లకు అద్భుతమైన టానిక్ కోహ్లీ అన్నాడు.
తాను టెస్టు క్రికెట్ కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడం తనను బాధ పెట్టిందన్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరం గౌరవిస్తున్నామని (Jasprit Bumrah)తెలిపాడు బుమ్రా.
కోహ్లీ లేని జట్టును ఊహించు కోలేమన్నాడు. ఆయన ఎల్లప్పటికీ తమ నాయకుడిగా ఉంటాడని మరోసారి స్పష్టం చేశాడు బుమ్రా.
Also Read : రషీద్ లతీఫ్ సంచలన కామెంట్స్