PM Modi Gifts : మోదీ బహుమతులతో దేశాధినేతలు ఫిదా
గుజరాత్..హిమాచల్ ప్రదేశ్ నుంచి గిఫ్టులు
PM Modi Gifts : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెరీ వెరీ స్పెషల్. ఆయన ఎక్కడికి వెళ్లినా తనదైన ముద్ర కనబరుస్తారు. ఆతిథ్యం ఇవ్వడంలోనే కాదు పలకరించడంలో, భోజనం వడ్డించడంలో..ఆపై విస్తు పోయేలా బహుమతులు ఇవ్వడంలో తనకు తనే సాటి. తాజాగా మరోసారి తనదైన స్పెషాలిటీతో దేశాధినేతలు విస్తు పోయేలా చేశారు.
రెండు రోజుల పాటు ఇండోనేషియాలోని బాలిలో జీ20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. ఇందులో మొత్తం 19 దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే నెల డిసెంబర్ 1 నుండి భారత దేశం జీ20 దేశాల గ్రూప్ నకు నాయకత్వం వహించనుంది.
నవంబర్ 16 బుధవారం తో జీ20 సదస్సు ముగిసింది. ప్రధానమంత్రి పలువురు ప్రధానులు, అధ్యక్షులతో సమావేశం అయ్యారు. ప్రపంచానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు జరిపారు.
బ్రిటన్ పీఎం రిషి సునక్, చైనా చీఫ్ జిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , కెనడా పీఎం మాక్రాన్ తో ముచ్చటించారు. ఇండోనేషియా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కీలక సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికీ విలువైన బహమతులు అందజేశారు ప్రధానమంత్రి(PM Modi Gifts).
ఆయా గిఫ్టులను గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో తయారు చేసినవి కావడం విశేషం. అమెరికా చీఫ్ జో బైడెన్ కు కాంగ్రా మినియేచర్ పెయిటింగ్ ను బహూకరించారు.
ఇక స్పానిష్ పీఎం పెడ్రో శాంచెజ్ కి బ్రాస్ సెట్ ను ఇచ్చారు. ఇందులో సంగీత వాయిద్యాలు ఉన్నాయి. ఇటలీ పీఎంకు పటాన్ పటోలా దుపట్టాను ఇచ్చారు.
యుకె పీఎం సునక్ కు మాతాని పచెడి కళా ఖండాన్ని బహూకరించారు. ఫ్రాన్స్ చీఫ్ మాక్రాన్ కు అగేట్ బౌల్ ను అందజేశారు.
సింగపూర్ కు చెందిన లీ సీన్ లూంగ్ , జర్మనీకి చెందిన ఓలాఫ్ స్కోల్ లకు కూడా గిఫ్టులు బహూకరించారు. పిథోరాను ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ కి అందజేశారు.
Also Read : మీడియా ఓనర్ల వల్ల డెమోక్రసీకి ముప్పు