Heather Knight : క‌ళ్లు చెదిరే క్యాచ్ తో ‘హీథ‌ర్ నైట్’ కేక‌

నెట్టింట్లో వైర‌ల్ గా మారిన వీడియో

Heather Knight : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ – ఐసీసీ మ‌హిళా వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో అరుదైన దృశ్యాల‌కు వేదిక‌గా మారింది. నిన్న ఆస్ట్రేలియాతో భార‌త మ‌హిళా బ్యాట‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్ 81 మీట‌ర్ల సిక్స‌ర్ తో దుమ్ము రేపింది.

ఇక తాజాగా న్యూజిలాండ్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ జ‌ట్టు ఒక్క వికెట్ తో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో అద్భుతం చోటు చేసుకుంది. జ‌ట్టు కెప్టెన్ హీథ‌ర్ నైట్(Heather Knight) ఒంటి చేత్తో క్యాచ్ తీసుకుంది.

విస్తు పోయేలా చేసింది. కీవీస్ కు చెందిన లీ త‌హూహ‌ష్ట్రను అవుట్ చేసేందుకు హీథ‌ర్ నైట్ మైదానంలో సంచ‌ల‌న ప్ర‌య‌త్నం చేసింది.

ఆదివారం ఈడెన్ పార్క్ లో జ‌రిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆస‌క్తి నెల‌కొంది. హీథ‌ర్ నైట్ కుడి వైపున‌కు ఎగిరి ఫోర్ పోయే బంతిని అమాంతం ప‌ట్టుకుంది.

రెండు జ‌ట్ల‌కు ఈ మ్యాచ్ ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఈ అద్భుత‌మైన క్యాచ్ ఇప్పుడు నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇంగ్లండ్ స్కిప్ప‌ర్ హీథ‌ర్ నైట్ తీసుకున్న క్యాచ్ ను ఐసీసీ వీడియోను షేర్ చేసింది.

ఇదిలా ఉండ‌గా ఇంగ్లీష్ బౌల‌ర్ల ధాటికి కీవీస్ లోయ‌ర్ మిడిల్ ఆర్డ‌ర్ , టెయిలెండ‌ర్లు కొంత ఇబ్బంది ప‌డ్డారు. మ్యాడీ గ్రీన్ 52 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిల‌వ‌డంతో చివ‌ర్లో కీవీస్ 48.5 ఓవ‌ర్ల‌లో 203 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఇంగ్లండ్ త‌ర‌పున కేట్ క్రాస్ , సోఫీ ఎక్లెస్టోన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. షార్లెట్ డీన్ రెండు వికెట్లు తీశాడు.

Also Read : దుమ్ము రేపుతా దంచి కొడ‌తా

Leave A Reply

Your Email Id will not be published!