Heavy Rains AP : ఏపీలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు

కుండ‌పోత‌తో జ‌నం అవ‌స్థ‌

Heavy Rains AP : ఉన్న‌ట్టుండి వ‌ర్షాల తాకిడి మ‌రోసారి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని తాకింది. రాత్రి నుంచి ఎడ తెరిపి లేకుండా కురుస్తుండ‌డంతో ప‌లు చోట్ల ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది. ప‌లు జిల్లాల‌లో వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి. క‌ర్నూలు జిల్లా అత‌లా కుత‌లంగా మారింది. ఎక్క‌డ చూసినా నీళ్లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

కంటిన్యూగా వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో(Heavy Rains AP) వాగులు, వంక‌లు పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆయా గ్రామాల‌కు వెళ్లే వారంతా తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. జిల్లాలోని గోనెగండ్ల‌, ఆస్ప‌రి , త‌దిత‌ర మండ‌లాల‌ను వ‌ర్షం భ‌యాందోళ‌న‌కు గురి చేసింది. గాజుల‌దిన్నె , సుంకేసుల ప్రాజెక్టుల‌కు భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరింది.

గాజుల‌దిన్నెకు పెద్ద ఎత్తున వర‌ద వ‌స్తుండ‌డంతో కొన్ని గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు ప‌రిధిలోని మండ‌లాల ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. ప‌లు రోడ్ల‌కు లింకులు తెగి పోయాయి. ఇక ఆదోని ప‌ట్ట‌ణంలో ఇల్లు కూలి ఒక‌రు మృతి చెందారు. మ‌రి కొంద‌రికి గాయాల‌య్యాయి. అదే ప‌నిగా వ‌ర్షాల తాకిడి మ‌రింత ఎక్కువ కావ‌డంతో జ‌నం తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతోంది.

ఇక రాష్ట్రంలోని అనంత‌పురం జిల్లాలో కూడా వ‌ర్షాల తాకిడి ఎక్కువ‌వుతోంది. న‌డిమివంక వాగు ప్ర‌మాద‌క‌ర స్థాయిని దాటి ప్ర‌వహిస్తోంది. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లను పున‌రావాస ప్రాంతాల‌కు త‌ర‌లించారు. రాయ‌దుర్గంలో సైతం వర్షాలు ఎడ తెరిపి కురిశాయి. కురుస్తున వ‌ర్షాల ధాటికి ప‌లు చోట్ల ట్రాఫిక్ జాం ఏర్ప‌డింది.

వాహ‌నాలు దెబ్బ తిన్నాయి. కురుస్తున్న వ‌ర్షాల‌కు సంబంధించి సీఎం జ‌గ‌న్ రెడ్డి ఆరా తీశారు. ఎవ‌రూ ఇబ్బందులు ప‌డ‌కుండా స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సీఎస్ ను ఆదేశించారు.

Also Read : ఏపీ సీఎం ప‌నితీరు భేష్ – లార్స‌న్

Leave A Reply

Your Email Id will not be published!