Heavy Rains : భారీ వ‌ర్షం త‌ల్ల‌డిల్లిన భాగ్య‌న‌గ‌రం

ఎడ తెరిపి లేకుండా వాన‌లు

Heavy Rains : ఎడ తెరిపి లేకుండా భారీగా వ‌ర్షాలు కురిసాయి. భాగ్య న‌గ‌రాన్ని ముంచెత్తాయి. అస‌లే ఎండా కాలం ఈ వాన‌లు కురియ‌డం ఏమిటో అర్థం కాక జ‌నం త‌ల‌లు ప‌ట్టుకున్నారు.

ఉప‌రిత‌ల ద్రోణి ప్ర‌భావంతో బుధ‌వారం ఉద‌యం నుంచే ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల‌తో కూడిన వాన దంచి కొట్టింది. ప‌లు చోట్ల ఫ్లెక్సీలు, చెట్లు విరిగి ప‌డ్డాయి ఈదురు గాలుల దెబ్బ‌కు. న‌గ‌రంలోని భారీ వ‌ర్షం దెబ్బ‌కు లోత‌ట్టు ప్రాంతాలు మునిగ పోయాయి.

రోడ్ల‌న్నీ నీళ్ల‌తో నిండి పోయాయి. హైద‌రాబాద్ సిటీలో ప్ర‌ధానంగా సీతాఫ‌ల్ మండ‌లిలో భారీ వ‌ర్ష‌పాతం(Heavy Rains) న‌మోదైంది. బ‌న్సీలాల్ పేట‌, వెస్ట్ మారేడుప‌ల్లి, ఆల్వాల్ , ఎల్బీ న‌గ‌ర్ , బాలాన‌గ‌ర్ , ఏఎస్ రావు న‌గ‌ర్ , బేగంపేట‌, మ‌ల్కాజ్ గిరిలో భారీగా వ‌ర్షం కురిసింది.

వీటితో పాటు ఫ‌ల‌క్ నుమా , గ‌న్ ఫౌండ్రీ , కాచిగూడ‌, సికింద్రాబాద్ , చార్మినార్ , గుడ్డి మ‌ల్కాపూర్ , నాచారం, అంబర్ పేట, అమీర్ పేట‌, సంతోష్ న‌గ‌ర్ ల‌లో ఎడ తెరిపి లేకుండా వాన‌లు కురిశాయి.

ఇక నిత్యం ర‌ద్దీగా ఉండే బేగం బ‌జార్ , హ‌య‌త్ న‌గ‌ర్ , చిలుకా న‌గ‌ర్ ల‌లో 3.5 సెంటీమీట‌ర్ల మేర వ‌ర్ష‌పాతం కురిసింది. వీటితో పాటు సైదాబాద్ , చంపాపేట్ , స‌రూర్ న‌గ‌ర్ , నాగోల్ , వ‌న‌స్థ‌లి పురం,తుర్క‌యాంజాల్ , పెద్ద అంబ‌ర్ పేట‌, అబ్దుల్లాపూర్ మెట్ లో ఈదురుగాలుల‌తో కూడిన భారీ వ‌ర్షం న‌మోదైంది.

ఎక్క‌డ చూసినా ఉరుములు, మెరుపుల‌తో ద‌ద్ద‌రిల్లింది న‌గ‌రం. దీంతో నిన్న‌టి దాకా కాంతులీనిన భాగ్య‌న‌గ‌రం అభాగ్య‌న‌గ‌రంగా మారి పోయింది.

Also Read : బిజేపికి తీన్మార్ మ‌ల్ల‌న్న ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!