Tirumala Updates : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
సర్వ దర్శనం కోసం చానా కష్టం
Tirumala Updates : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉన్నది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోప తండాలుగా వస్తూనే ఉన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Updates) ఏర్పాట్లు చేసింది.
రాను రాను శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ లను దర్శించు కోవడం పెరుగుతోంది. స్వామిని నమ్ముకుంటే కోరిన కోర్కెలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం. గతంలో కరోనా కారణంగా దర్శనం నిలిపి వేసిన టీటీడీ మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో దర్శనాలకు క్లియరెన్స్ ఇచ్చింది.
ఇక రెండు సంవత్సరాలుగా స్వామి వారికి నిలిపి వేసిన సేవలను తిరిగి పునరుద్దరించింది టీటీడీ. తాజాగా శ్రీవారి దర్శనం మరింత ఆలస్యం అవుతోంది. శ్రీవారి దర్శనానికి 28 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారు. కనీసం దర్శనం కావలంటే 8 గంటలకు పైగా సమయం పడుతుందని అంచనా.
నిన్న ఒక్క రోజే 62 వేల మందికి పైగా దర్శించుకున్నారు. 29 వేల మందికి పైగా తలనీలాలు సమర్పించారు. ఇక భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం ఒక్క రోజే రూ. 3.91 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది.
ఇక అక్టోబర్ 25న సూర్య గ్రహణం, నవంబర్ 8న చంద్రగ్రహణం ఉండడంతో ఈ రెండు రోజులు శ్రీవారి ఆలయాన్ని మూసి వేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. గ్రహణం రోజుల్లో వీఐపీ బ్రేక్ , శ్రీవాణి, రూ. 300 దర్శనాలు, ఆర్జిత సేవలు, అన్ని రకాల సేవలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది.
కంపార్టుమెంట్లలో ఉన్న భక్తులకు సేవకులు సాయం చేస్తున్నారు.
Also Read : పుణ్య స్థలాలను నిర్లక్ష్యం చేశారు – మోదీ