Heinrich Klaasen : క‌దం తొక్కిన‌ హెన్రిచ్ క్లాసెన్

63 బంతులు 12 ఫోర్లు 4 సిక్స‌ర్లు 104 ర‌న్స్

Heinrich Klaasen : హైద‌రాబాద్ లోని రాజీవ్ గాంధీ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు చేతిలో 8 వికెట్ల తేడాతో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓట‌మి పాలైంది. కానీ అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది. ఐపీఎల్ 16 సీజ‌న్ నుంచి క‌నీసం ఆఖ‌రి మ్యాచ్ లోనైనా గెలుపొంది ప‌రువు ద‌క్కించు కోవాల‌ని అనుకుంది. కానీ హైద‌రాబాద్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ఆర్సీబీ. కెప్టెన్ డుప్లెసిస్ దంచి కొడితే విరాట్ కోహ్లీ దుమ్ము రేపాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు.

అంత‌కు ముందు బ్యాటింగ్ కు దిగింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆరంభం లోనే అభిషేక్ శ‌ర్మ‌, రాహుల్ త్రిపాఠిల వికెట్ల‌ను కోల్పోయింది. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చాడు హెన్రిచ్ క్లాసెన్. వ‌చ్చీ రావ‌డంతోనే ఆర్సీబీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో ఆక‌ట్టుకున్నాడు.

త‌క్కువ బంతుల్లోనే అద్భుత‌మైన సెంచ‌రీని న‌మోదు చేశాడు హెన్రిచ్ క్లాసెన్. ఆఖ‌రి ఓవ‌ర్ లో వెనుదిరిగాడు. కేవ‌లం 51 బంతులు మ‌త్ర‌మే ఎదుర్కొన్న క్లాసెన్ 104 ర‌న్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 6 సిక్స‌ర్లు ఉన్నాయి. ఫోర్లు , సిక్స‌ర్ల‌తో క‌లుపుకుంటే 68 ప‌రుగులు వ‌చ్చాయి. కొన్ని సిక్స‌ర్ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క్లాసెన్ దుమ్ము రేపినా త‌న జ‌ట్టు గెల‌వ‌లేక పోయింది.

Also Read : Faf Du Plessis

 

Leave A Reply

Your Email Id will not be published!