Hema Malini : మోదీజీ క‌ళాకారుల‌ను ఆదుకోండి

బీజేపీ ఎంపీ హేమమాలిని డిమాండ్

ఈ దేశ సంస్కృతి (Culture) , వార‌స‌త్వాన్ని కాపాడుకుంటూ వ‌స్తున్న క‌ళాకారుల‌ను ఆదుకోవాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వంపై (On The Central Government)  ఉంద‌న్నారు బీజేపీ ఎంపీ, ప్ర‌ముఖ న‌టి హేమ‌మాలిని (Hema Malini) . సృజ‌నాత్మ‌క‌ను క‌లిగి వుండే వారు జాతికి ఓ సంప‌ద లాంటి వార‌ని పేర్కొన్నారు.

కొద్ది మంది కళాకారులు మాత్ర‌మే బాగున్నార‌ని 90 శాతానికి పైగా క‌ళాకారులు, ప్ర‌తిభ క‌లిగిన వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ దేశంలో ల‌క్ష‌లాది మంది క‌ళాకారులు అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాలు క‌లిగి ఉన్నార‌ని కానీ వారికి స‌రైన ప్రోత్సాహం, తోడ్పాటు ఉండ‌డం లేద‌న్నారు.

క‌ళ‌ల ప‌ట్ల‌, భార‌త జాతి ప‌ట్ల‌, సంస్కృతి (Culture) , సంప్ర‌దాయాల ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి (Prime Minister) న‌రేంద్ర మోదీకి అభిమానం ఉంద‌ని ఈ అంశంపై మ‌రోసారి ఆలోచించాల‌ని సూచించారు ఆమె.

ప్ర‌పంచంలోనే భార‌త దేశం అత్యుత్త‌మ‌మైన‌దిగా కీర్తింప బ‌డుతోంద‌ని ఇది కేవ‌లం క‌ళాకారుల వ‌ల్ల‌నే జ‌రుగుతోంద‌న్నారు. మిగతా రంగాలు వేరు క‌ళా రంగం వేరు.

ఇందులోకి వ‌చ్చిన వారు వేరే రంగాల‌లో ఉండ‌లేరన్నారు హేమ‌మాలిని (Hema Malini) . ఏ దేశ‌మైనా క‌ళాకారుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే దానిని పూర్తిగా తిర‌స్క‌రించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

ఒక ఆర్టిస్టుగా తాను ఆందోళ‌న చెందుతున్నాని తెలిపారు. జాన‌ప‌ద‌, శాస్త్రీయ‌, ఇత‌ర క‌ళాకారులు నేటికీ గుర్తింపున‌కు నోచుకోవ‌డం లేద‌న్నారు. వారికి గుర్తింపు కార్డులతో పాటు పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని ప్ర‌ధాన మంత్రి (Prime Minister) మోదీని కోరారు.

దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల‌కు చెందిన క‌ళాకారుల‌కు ప్ర‌త్యేక నిధిని ఏర్పాటు చేయాల‌ని సూచించారు హేమ‌మాలిని (Hema Malini) .

Leave A Reply

Your Email Id will not be published!