Prabhas Jr NTR Comment : తారళ తళుకు బెళుకులు రక్షిస్తాయా
వరుస భేటీలతో హోరెత్తిస్తున్న బీజేపీ
Prabhas Jr NTR Comment : తెలంగాణలో(Telangana Politics) రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. నిన్నటి దాకా కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గా ఉండేది.
కానీ గత కొంత కాలం నుంచీ భారతీయ జనతా పార్టీ ఊహించని రీతిలో దూసుకు వచ్చింది. దుబ్బాక, నగర పాలక ఎన్నికలు, హుజూరాబాద్ లలో
ఆశించిన దాని కంటే ఎక్కువగా ఫలితాలు కాషాయానికి అనుకూలంగా వచ్చాయి.
తాజాగా కాంగ్రెస్ లో బలమైన వర్గంగా పేరొందిన కోమటిరెడ్డి బ్రదర్స్ లలో ఒకరు బీజేపీకి జంప్ కావడం, కీలకమైన నేతలు కాషాయ తీర్థం పుచ్చు
కోవడంతో రాబోయే ఎన్నికలలో త్రిముఖ పోరుకు అవకాశం ఉంది.
మరో వైపు రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తున్నా ఆ పార్టీలో అంతర్గత పోరు పార్టీకి గుదిబండగా మారింది.
ఆ పార్టీ నుంచి కీలకమైన నాయకులు రాజగోపాల్ రెడ్డితో పాటు మేధాగా పేరొందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ గుడ్ బై చెప్పడం ఒక రకంగా షాక్ కు గురి చేసింది.
ఇక ఉద్యమ నేపథ్యం కలిగిన ఈటల రాజేందర్ , మాటల తూటాలు పేల్చే బండి సంజయ్, రఘునందన్ రావు, ఎలాంటి సిట్యూయేషన్ లోనైనా తన వైపు విజయం వరించేలా చేయడంలో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన జితేందర్ రెడ్డి, డీకే అరుణ లాంటి వాళ్లు ఇప్పుడు పార్టీకి పిల్లర్స్ గా మారారు.
ఇదే సమయంలో జాతీయ స్థాయిలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కాషాయ పార్టీలో ట్రబుల్ షూటర్ గా
పేరొందిన అమిత్ షా తెలంగాణపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
ఎలాగైనా సరే పవర్ లోకి రావాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా ప్రభావితం చేసే సినిమా
రంగానికి చెందిన వారిని తమ వైపు తిప్పుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే ఆయనను జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. మరో వైపు పాన్ ఇండియా స్టార్ గా పేరొందిన ప్రభాస్(Prabhas Jr NTR) ను కూడా తమ వద్దకు రప్పించుకునే పనిలో పడ్డారు.
ఇక విజయశాంతి ఉండనే ఉన్నారు. మరికొంత మంది నటీనటులను తమ వైపు తిప్పు కునేందుకు ట్రై చేస్తున్నారు. యూత్ లో బలమైన
అభిమానులను కలిగి ఉన్నారు తారక్ , ప్రభాస్. మరో వైపు నితిన్ లాంటి హీరోలు కూడా బీజేపీ వైపు చూసే చాన్స్ ఉంది.
ఏది ఏమైనా తారళ తళుకు బెళుకులు తెలంగాణలో ఏ మేరకు ప్రభావితం చేస్తాయో చూడాలి. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాలు వేరు. కానీ
తెలంగాణ రూటే సపరేట్. ఆ విషయం తెలుసుకుంటే బెటర్.
Also Read : ‘చిరుతలు’ రావడం చారిత్రాత్మకం – మోదీ