Rahul Tyson : హీరో టైసన్ రాహుల్ కొత్త సినిమా ఆరంభం
Hero Tyson Rahul is the beginning of a new movie
Rahul Tyson : యస్.యస్ స్టూడియోస్ & విజన్ సినిమాస్ పతాకం పై శ్రీమతి దివిజా సమర్పణలో విరాట్ చక్రవర్తి దర్శకత్వంలో సాయి కార్తీక్,నాగం తిరుపతి రెడ్డి,శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్న థ్రిల్లర్, కామెడీ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాల తో ఘనంగా ప్రారంభ మైంది.. రాహుల్, చేతన్,సాక్షి చౌదరి,ఐశ్వర్య,యమీ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఆరంభానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మధుర శ్రీధర్ పూజ కార్యక్రమాలలో పాల్గనగా చిత్ర నిర్మాత లలో ఒకరైన సాయి కార్తీక్ క్లాప్ కొట్టగా, నాగం తిరుపతి రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు, చిత్ర సహ నిర్మాత శ్రీకాంత్ దీపాల గౌరవ దర్శకత్వం వహించారు..
అనంతరం జరిగిన మీడియా సమావేశంలో నిర్మాత సాయి కార్తీక్ మాట్లాడుతూ… సంగీత దర్శకుడిగా పనిచేస్తన్న నేను మొదటి సారిగా ప్రొడక్షన్ రంగం లోకి నా మిత్రుల ప్రోద్భలంతో దిగాను ఈ సినిమా వైవిధ్యమైన కథతో రూపుదిద్దుకోబోతోంది. మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను ఆదరించినట్లే ప్రొడ్యూసర్ గా కూడా ఆదరించాలని కోరారు.
డైరెక్టర్..విరాట్ చక్రవర్తి మాట్లాడుతూ… ఇది డిఫ్రెంట్ థ్రిల్లర్ కామెడీ సినిమాఅని, పాత్రలకు తగిన హీరో,హీరోయిన్లు దొరకటం అదృష్టంగా ఉందని చెప్పారు. రెగ్యులర్ షూటింగ్‌తో .ఈ మూవీ జనవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు.
హీరో చేతన్ మాట్లాడుతూ… కన్నడలో 10 సినిమాలు చేసిన నాకు తొలిసారి తెలుగు లో అవకాశం వచ్చింది. అదీ మిత్రుడు రాహుల్ తో కలసి చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉందన్నారు.
రాహుల్ మాట్లాడుతూ మంచి కథతో నన్ను ప్రోత్సహిస్తున్న దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్తున్నానని, తనకు ఇదో మంచి చిత్రం కానుందని, జనవరి చివరనాటికి షూటింగ్ పూర్తి చేసి మార్చినాటికి ప్రేక్షకుల మందుకు తెస్తామని చెప్పారు.
