Harish Rao: మ‌ళ్లీ క్రికెట్ అవ‌తారం ఎత్తిన మంత్రి హ‌రీష్‌

Minister Harish incarnates cricketer again

Harish Rao : నిన్న,మొన్నటిదాకా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపి రాజకీయాల్లో నిరంతరం బిజిబిజీగా ఉండే మంత్రి హరీష్ రావు. మ‌రోమారు ప్రొఫెషనల్ క్రికెటర్ తరహాలో పరుగుల వరద పారించాడు. సిద్దిపేటలో బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చెందిన మెడికవర్ ఆస్పత్రి-సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ జట్ల మధ్య జరిగిన ఫ్రెండ్లీ – టీ20క్రికెట్ మ్యాచ్‌లో సిద్దిపేట జట్టుకు కెప్టెన్ బాధ్య‌త‌లు వ‌హించిన హ‌రీష్ ఈ మ్యాచ్‌లో త‌న‌దేఐన మార్కు చూపించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన సిద్దిపేట జట్టు త‌ర‌పున‌ నాలుగో స్థానంలో వస్తూనే రెండు వరుస బౌండరీలు బాదారు. 12 బంతుల్లో 18 పరుగులు చేసి ఔటయినా… మైదానంలో ప్రొఫెషనల్ క్రికెటర్‌లా బ్యాటింగ్ చేసిన హరీష్‌ను చూసి ప్రేక్షకులు,అభిమానుల హ‌ర్షాతిరేకాలు అన్నీ ఇన్నీ కావు. ఈ మ్యాచ్‌లోనిర్ణీత 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. తమ నాయకుడు రాజకీయాల్లోనే కాదు, మైదానంలోనూ అదరగొట్టగలడని, ఏ బాధ్యత అప్పగించినా ఒంటిచేత్తో నెరవేర్చే సత్తా ఉన్న నాయకుడుగా జేజేలు ప‌లుకుతున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!